అమెరికాలో ఆటాడుకుందాం.. రా

జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సుశాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన “ఆటాడుకుందాం..రా” చిత్రం రేపు రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అమెరికాలోను ఈ మూవీ ఎక్కువ థియేటర్లో  విడుదల కానుంది. ఈ సందర్భంగా “చికాగో సుబ్బారావ్” వెబ్ సైట్ నిర్వాహకులు ఈ మూవీ లో టైం మిషన్ కాన్సెప్ట్ పై అమెరికన్లను మాట్లాడించారు.

మీకు గతంలోకి, భవిష్యత్తు లోకి వెళ్లే అవకాశం వస్తే ఏమి చేస్తారు, ఎవరిని కలుస్తారు అనే  ప్రశ్నలను అడిగారు. అందుకు వారు సంతోషంగా స్పందించి మనసులోని కోరికను బయట పెట్టారు. ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ ని కలుస్తాను అని ఒకరంటే, అమెరికా పూర్వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తో మాట్లాడుతానని మరొకరు చెప్పారు. ఇంకా కరాటే కింగ్ బ్రూస్లీ దగ్గర కరాటే నేర్చుకుంటాను.. హిట్లర్ ని ప్రత్యక్షంగా చూస్తాను.. డైనోసార్లతో గడుపుతానని మరికొంతమంది చెప్పారు.

వెయ్యి ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నానని ఓ అమ్మాయి చెప్పింది. “ఆటాడుకుందాం..రా” ఫిల్మ్ లోని కాన్సెప్ట్ తో తీసిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో హీరో సుశాంత్ కూడా కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పారు. మీరు ఆ వీడియోని చూడాలనుకుంటే కింద క్లిక్ చేయండి.

America lo Aatadukundam Raa || Chicago Subbarao

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus