మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రీజినల్ మూవీస్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరు బాక్సాఫీస్ స్టామినాకి సంక్రాంతి సీజన్, దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజ్ ఈ సినిమాకి కలిసొచ్చాయి అని చెప్పాలి. సరే చిరు నెక్స్ట్ సినిమా సంగతేంటి అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. చిరు నెక్స్ట్ ఫోకస్ పెట్టేది ఈ సినిమాపైనే అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాబీ కూడా చిరు ఇమేజ్ ని కరెక్ట్ గా డీల్ చేయగలడు. ‘వాల్తేరు వీరయ్య’ తో ఆ విషయం ప్రూవ్ అయ్యింది. బౌండ్ స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది. చిరు డేట్స్ ఇవ్వాలే కానీ.. నెక్స్ట్ సంక్రాంతికి రెడీ చేసి దింపే అవకాశాలు ఉన్నాయి.
కానీ చిరు ఆ స్టెప్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో చిరు ‘విశ్వంభర’ని పెండింగ్లో పెట్టారు. గతేడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ… జూలైలో దింపాలని చూస్తున్నారు. అది కూడా సీజీ వర్క్ సంతృప్తి కరంగా వస్తేనే. ఈ సినిమాకి బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదు. మరోపక్క వీఎఫ్ఎక్స్ రూపంలో ఇప్పటికే నిర్మాతలకి తడిసి మోపెడయ్యింది.
అలా అని వదిలించుకోవడానికి దించేస్తే.. భయంకరమైన ట్రోలింగ్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే బాబీ సినిమాని చిరు కొన్నాళ్ళు హోల్డ్..లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.