‘సలార్’ ‘కల్కి 2898 AD’ వంటి హిట్లతో ఫామ్లోకి వచ్చిన ప్రభాస్.. ఆ తర్వాత ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేయడం జరిగింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని చవి చవి చూసిందో అందరికీ తెలుసు. ఈ సినిమా ఫలితాన్ని ఎక్కువగా దర్శకుడు మారుతీ అకౌంట్లో వేస్తూ ట్రోలింగ్ చేస్తున్న జనాలు కూడా వార్తల్లో నిలుస్తున్నారు. హీరో ప్రభాస్ ఈ సినిమా తాలూకు జ్ఞాపకాల నుండి బయటకి వచ్చేసి.. ‘స్పిరిట్’ సినిమా చేసుకుంటున్నాడు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం కొత్త మేకోవర్ ట్రై చేస్తున్నాడు. పోస్టర్ తోనే ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆల్రెడీ ఓటీటీ బిజినెస్ కూడా జరిగిపోయింది. పారితోషికాలు కాకుండా మేకింగ్ కాస్ట్.. అంతా ఓటీటీ బిజినెస్ కంటే తక్కువ ఖర్చులో ఫినిష్ అయిపోతుందని ఇన్సైడ్ టాక్.
సో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది కొంత ఊరటనిచ్చే వ్యవహారమే. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఫౌజి'(Fauji) రిలీజ్ డేట్ వ్యహారం సడన్ గా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు టాక్ నడుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాపై ఎటువంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. దర్శకుడు హను ట్రాక్ రికార్డు కూడా అంతంతమాత్రమే.
అందువల్ల ఓటీటీ బిజినెస్ కూడా జరగలేదు. అసలే ‘ది రాజాసాబ్’ దెబ్బతో అటు ఇటుగా ఉన్న ప్రభాస్ అభిమానులు.. ‘ఫౌజి’ పై ఇంట్రెస్ట్ చూపిస్తారా అనేది అనుమానమే.