‘ఖడ్గం’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో హీరోయిన్ సంగీత సినిమా అవకాశాల కోసం ఎదుర్కొన్న సవాళ్ళు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అయితే ఈ సన్నివేశాన్ని దర్శకుడు కృష్ణవంశీ(Krishna Vamsi) ఓ టాలీవుడ్ అగ్ర దర్శకుడిపై సెటైరికల్ గా పెట్టినట్టు అప్పట్లో టాలీవుడ్ కోడై కూసింది. అయితే ఆ టైంలోనే దర్శకుడు కృష్ణవంశీ ఈ విషయం పై స్పందించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మళ్ళీ హల్ చల్ చేస్తుంది.
సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న ఓ మహిళా పాత్ర ‘ఖడ్గం’ సినిమాలో కనిపిస్తుంది. ఓ దర్శకుడి చేతిలో ఆ మహిళ లైంగిక దోపిడీకి గురవుతుంది. ఏ దర్శకుడిని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రని సృష్టించారు? అంటూ యాంకర్ కృష్ణవంశీని ప్రశ్నించడం జరిగింది. అందుకు కృష్ణవంశీ.. ” ఏ దర్శకుడినీ దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రని సృష్టించలేదు. అది క్యాస్టింగ్ కౌచ్ అనే ఫెనోమినా ఇండస్ట్రీలో జరుగుతుంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ సినిమా ఇండస్ట్రీల్లో జరుగుతుంది.
అయితే అక్కడక్కడా జరుగుతున్నాయి. అన్నీ అవే అని నేను చెప్పడం లేదు. కొంతమంది అమ్మాయిలు ఆ బలి అవుతున్నారు” అంటూ కృష్ణవంశీ బదులిచ్చాడు. అయినప్పటికీ సదరు యాంకర్.. “అయితే ఆ సన్నివేశంలో మహిళని బెడ్రూమ్లోకి పిలిచిన సమయంలో మీరు కొన్ని పండ్లను, పూలను చూపించడం జరిగింది. కేవలం ఒక దర్శకుడినే మీరు టార్గెట్ చేసి ఆ సన్నివేశం, ఆ పాత్రని క్రియేట్ చేసి పెట్టారు అని చాలా మంది భావిస్తున్నారు.
కేవలం వ్యక్తిగత శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతీకారంగా ఆ సన్నివేశం పెట్టారు అని కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు” అంటూ మళ్ళీ కృష్ణవంశీని ప్రశ్నించాడు. అందుకు కృష్ణవంశీ..”ఇలా చెప్పుకుంటున్న వాళ్ళు ఏ దర్శకుడి బెడ్రూమ్..కి వెళ్లి పూలు, పళ్ళు చూశారు.?” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇది పాత వీడియోనే అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుంది.
‘ఖడ్గం’ సినిమాలో హీరోయిన్ సంగీత సన్నివేశం పై కృష్ణవంశీ వివరణ ఇచ్చిన వీడియో. పాతదే అయినప్పటికీ మళ్ళీ వైరల్ అవుతుంది@director_kv #Khadgam #RaviTeja #Tollywood #TFI pic.twitter.com/T4Ti5oAnAe
— Phani Kumar (@phanikumar2809) January 30, 2026