2.5 కోట్లకు అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’ హిందీ శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న గోల్డ్ మైన్ ఫిల్మ్స్!

  • November 27, 2018 / 10:27 AM IST

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాల నటుడు భరత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధీరజ్ మొగిలినేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండడంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది.

2.5 కోట్లకు గోల్డ్ మైన్ ఫిల్మ్స్ హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం. గోల్డ్ మైన్ ఫిలిమ్స్ మంచి ఫ్యాన్సీ రేట్ కి హిందీ హక్కుల్ని తీసుకోవడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పటికే సౌతర్న్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పది చిత్రాల హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులు ఇదే సంస్థ కొనుగోలు చేసింది. ఇప్పుడు అల్లు శిరీష్ సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా 2.5 కోట్లకు ఏబీసీడీ తెలుగు చిత్రం హక్కులు తీసుకున్నట్టు గోల్డ్ మైన్ ఫిల్మ్స్ అధినేత మనీష్ తెలిపారు. ఈసందర్భంగా

గోల్డ్ మైన్ ఫిల్మ్స్ అధినేత మనీష్ మాట్లాడుతూ… అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఏబీసీడీ తెలుగు సినిమా హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కుల్ని 2.5 కోట్లకు మా గోల్డ్ మైన్ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకున్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని… హిందీ హక్కులు పొందాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 10 చిత్రాల హిందీ హక్కులు కూడా మేమే పొందాం. ఇప్పుడు అల్లు శిరీష్ సినిమా హిందీ హక్కులు తీసుకోవడం హ్యాపీగా ఉంది. అల్లు అర్జున్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తాయి. ఇప్పుడు అదే మాదిరిగా అల్లు శిరీష్ సినిమాకు కూడా డిజిటల్ లో అద్భుతమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus