అబ్దుల్ కలామ్ స్కూల్ లో షూటింగ్ జరుపుకున్న వరుణ్ తేజ్ మూవీ

మెగా హీరో వరుణ్ తేజ్ ఏకకాలంలో రెండు చిత్రాలను చేస్తున్నారు. ఘాజిని తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్నారు. స్పేస్ థ్రిల్లర్ జాన్రా లో రూపుదిద్దుకుంటున్న మూవీలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన కీలక షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన అంతరిక్షం సెట్ లో పూర్తి అయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిన్న షెడ్యూల్ రామేశ్వరంలో జరిగింది. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చదువుకున్న పాఠశాలలో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో 70 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర బృందం తెలిపింది.

ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి నటిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ చిత్రంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. F2 అనే టైటిల్ ఫిక్స్ చేసిన ఇందులో విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ పక్కన మెహరీన్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం పూర్తి అయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలుకానుంది. అందులో వరుణ్ తేజ్ పాల్గొననున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus