ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన రెండో కొడుకును పరిచయం చేసిన ఎన్టీఆర్!

ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిలకు గత గురువారం మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఆరోజు నుంచి తారక్ మరింత ఉత్సాహంగా ఉన్నారు. రెండో రోజే అంటే శుక్రవారమే అభిమానుల కోసం తన చిన్న కుమారుడు ఫోటోని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రశాంతంగా నిద్రపోతున్న బాబు ఫోటోని చూసి కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందపడ్డారు. అంతటితో ఆగలేదు. తన పెద్ద కుమారుడికి తమ్ముడిని పరిచయం చేశారు. అభయ్ రామ్ చేతుల్లో తమ్ముడిని ఉంచి తారక్ సంతోషపడ్డారు. ఆ క్షణాలు ఎప్పటికీ నిలిచిపోవాలని అభయ్ రామ్  తమ్ముడిని ఎత్తుకుని ఓ కుర్చీలో కూర్చుని ఉండగా, ఎన్టీఆర్ తన స్మార్ట్ ఫోన్ లో దాన్ని చిత్రీకరించారు.

అలా ఎన్టీఆర్ ఫోటో తీస్తున్న సంఘటనను కూడా మరొకరు కెమెరాలో బంధించారు. ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో తొలి పోస్టుగా ఎన్టీఆర్ ఉంచారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిన్నటి నుంచి మొదలు కావాల్సిన అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్  పొల్లాచి కి వెళ్ళాలి. కానీ కొడుకు పుట్టిన ఆనందంలో షెడ్యూల్ ని కొన్ని రోజులు వాయిదా వేశారు. ప్రస్తుతం మంచి పండితులతో కలిసి రెండో బిడ్డ జన్మనక్షత్రం బట్టి పేరు పెట్టడానికి కొన్ని పేర్లు వెతికే పనిలో ఎన్టీఆర్ దంపతులు ఉన్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇతనికి కూడా పేరు చివరన రామ్ ఉంటుందని టాక్. మరి ఏ పేరు పెడుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus