విశాల్, సమంత.. హీరో హీరోయిన్లుగా పి.ఎస్.మిత్రన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘అభిమన్యుడు’. హీరో విశాల్ ఈ చిత్రాన్ని తన ‘విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ’ బ్యానర్ పై నిర్మించాడు. తెలుగులో ఈ చిత్రం 2018వ సంవత్సరం జూన్ 1న విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నాగార్జున ‘ఆఫీసర్’ కు పోటీగా విడుదలైన ఈ డబ్బింగ్ చిత్రం దానిని పూర్తిగా డామినేట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మరి ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.10 cr |
సీడెడ్ | 1.20 cr |
ఉత్తరాంధ్ర | 1.56 cr |
ఈస్ట్ | 0.80 cr |
వెస్ట్ | 0.55 cr |
గుంటూరు | 0.75 cr |
కృష్ణా | 0.82 cr |
నెల్లూరు | 0.40 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 9.18 cr |
‘అభిమన్యుడు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.9.18 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే రూ.4.98 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించిందన్న మాట. కాబట్టి ఈ చిత్రాన్ని డబుల్ బ్లాక్ బస్టర్ గా పరిగణించాలి.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!