అభినేత్రి

  • October 7, 2016 / 01:57 PM IST

దాదాపు చాలాకాలం తర్వాత ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభుదేవా మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం ‘అభినేత్రి’. ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదలయ్యింది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌ సినిమాతో కలిసి తెలుగులో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. మ్యూజికల్, లవ్, హర్రర్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాను దసరా కానుకగా నేడు (అక్టోబరు 7) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

కథ : కార్పొరేట్ ఉద్యోగం చేసే కుర్రోడు కృష్ణ కుమార్(ప్రభుదేవా). ఇంగ్లిష్ మాట్లాడే మోడ్రన్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనేది కృష్ణ కోరిక. అయితే అనుకోకుండా పెద్దల ఒత్తిడి వల్ల దేవి (తమన్నా)ను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెను తీసుకొని ముంబాయ్ లోని ఓ అపార్ట్మెంట్ లో కాపురం పెడతాడు కృష్ణ. ఆ అపార్ట్మెంట్ లో దిగిన తర్వాత రూబీ అనే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అసలు రూబీ ఎవరు? ఆ అపార్ట్మెంట్ లో ఏం జరిగింది? తమన్నాకి రూబీకి సంబంధం ఏంటి? కృష్ణకి ఎదురైన సంఘటనలు ఏంటి? వీటన్నిటిని కృష్ణ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథాంశం.

నటీనటుల పనితీరు : ‘అభినేత్రి’ సినిమాతో మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా తనదైన యాక్టింగ్ తో అదరగొట్టాడు. తన డాన్స్ తోనే కాకుండా కామెడి టైమింగ్, యాక్టింగ్ లో కూడా మంచి నటనను కనబరిచాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రభుదేవా నటన బాగుంది. ఇక అభినేత్రి రెండు షేడ్స్ లో చక్కగా నటించింది. పల్లెటూరి అమ్మాయిగా, హీరోయిన్ గా వేరియేషన్ ను బాగా చూపించింది. ఇక ఓ సాంగ్ లో తమన్నా తన డాన్స్ తో పిచ్చేక్కించేసింది. ప్రభుదేవా-తమన్నాల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. పానకంలో పుడకలాగా ప్రభు-తమన్నాల మధ్య సోనూసూద్ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యింది. సోనూసూద్ తన పాత్రకు తగిన న్యాయం చేశాడు. ‘తుతక్ తుతక్ తుతియా…’ సాంగ్ లో సోనూ తన డాన్స్ తో అలరించాడు. ఇక అమీజాక్సన్ కేవలం గ్లామర్ పాత్రకే పరిమితమయ్యింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలో బాగా నటించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదా సరదాగా సాగిపోయినా… ఇంటర్వెల్ బ్యాంగ్ టైం లో ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ తో పాటు హార్రర్, థ్రిల్లింగ్ అదిరింది.

సాంకేతికవర్గం పనితీరు : కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఇలాంటి కథతో ఇప్పటికే చాలా కథలొచ్చాయి. అయితే రొటీన్ స్టొరీని లవ్, మ్యూజిక్, డాన్స్ అనే అంశాలను జోడించి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు విజయ్ ప్రయత్నం బాగున్నా.. అక్కడక్కడ బోర్ కొట్టేలా చేస్తుంది. కొన్ని సీన్స్ తర్వాత ఏం జరుగనుందో ఆడియెన్స్ అలవోకగా చెప్పగలరు. పైగా పూర్తిగా కామెడి తరహాలో చెప్పాలనే ఉద్దేశ్యంతో స్క్రీన్ ప్లేను సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. కానీ దర్శకుడిగా మాత్రం విజయ్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. తెలియకుండానే ఈ సినిమా ద్వారా దర్శకుడు ఓ మంచి మెసేజ్ ను అందించాడు. మనుష్ నందన్ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. చల్ మార్ సాంగ్, తమన్నా సాంగ్ ను చాలా బాగా చూపించారు. విజువల్స్ పరంగా గ్రాండ్ గా తెరకెక్కించారు. సాజిద్-వాజిద్, విశాల్ మిశ్రా సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. ఎడిటింగ్ పర్వాలేదు. కొరియోగ్రఫీ బాగుంది. చివరగా నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను చాలా గ్రాండ్ గా, విజువల్ ట్రీట్ గా రూపొందించారు.

విశ్లేషణ : డాన్స్, కామెడి తరహాలో సాగే థ్రిల్లింగ్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఓసారి చూడదగ్గ చిత్రం.

రేటింగ్ : 1.5/5

Click Here For English Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus