‘జార్జ్ రెడ్డి’ హక్కుల్ని దక్కించుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్!

ఓ చిన్న సినిమా పై కాస్త బజ్ ఏర్పడిందంటే.. ఆ సినిమా హక్కులను వెంటనే కొనుగోలు చేసేస్తుంటారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు. అలా మహేష్ బాబు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇప్పుడు ‘జార్జ్ రెడ్డి’ సినిమా హక్కుల్ని కొనేసాడట. మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ నామా. అడివి శేష్ తో ‘గూఢచారి’ వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించాడు. ఇప్పుడు ‘జార్జ్ రెడ్డి’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల్ని కొనుగోలు చేశాడనేది తాజా సమాచారం. తాజాగా విడుదలైన ‘జార్జ్ రెడ్డి’ ట్రైలర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది.

ఉస్మానియా విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం చరిత్రతో ఈ చిత్రం రూపొందింది. ఎన్నో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు జీవన్ రెడ్డి. 1960, 70 లలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. దీంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ‘మైక్‌ మూవీస్‌’ , ‘త్రీ లైన్స్‌’ ‘సిల్లీ మాంక్స్‌ స్టూడియో’ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇలాంటి చిత్రాన్ని అభిషేక్ నామా రిలీజ్ చేయడంతో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus