ఏది ఒకసారి కలెక్షన్స్ లిస్ట్ చూపించు

ఇప్పుడో ఓ సినిమా హిట్టని చెప్పడానికి అమ్మినదానికి…. అమ్మినంతా కలెక్ట్ చేయాల్సి ఉంది. అప్పుడే ఆ హిట్ లిస్ట్ లో చేరుతుంది. ఒక వేళ అమ్మినదానికి మించి కలెక్షన్లు వస్తే ఆ సినిమాని బ్లాక్ బస్టర్ అంటారు. ఇదిలా ఉండగా… ఇప్పట్లో ఓ సినిమాని హీరోలు ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగానే హీరో అడివిశేష్ తన ‘ఎవరు’ సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఇందులో ఎలాంటి తప్పూ లేదు. కానీ పదే.. పదే.. తన సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. ఇది కూడా పర్వాలేదు… సినిమా కలెక్షన్లు పెంచుకోవడానికి ఇదో టెక్నిక్. ఇదిలా ఉండగా.. తన కెరీర్లోనే ‘ఎవరు’ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అంటూ ఓ ట్వీట్ చేశాడు.

దీనికి అడివి శేష్ తో ‘గూఢచారి’ చిత్రాన్ని నిర్మించి డిస్ట్రిబ్యూట్ చేసిన ‘అభిషేక్ పిక్చర్స్’ వారు హర్ట్ అయినట్టున్నారు. వెంటనే వారి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ” శేష్.. అది ఎలా సాధ్యం? ఇప్పటికీ మీ కెరీర్లో ‘గూఢచారి’ చిత్రానికే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మీరేమో ‘ఎవరు’ బిగ్గెస్ట్ అంటున్నారు. ఏది… ఒకసారి కలెక్షన్స్ లిస్ట్ చూపించండి.” అంటూ ప్రశించారు. కచ్చితంగా శేష్ కలెక్షన్లు షేర్ చేయాల్సి ఉంది. లేకపోతే శేష్ ఫేక్ కలెక్షన్స్ చెబుతున్నాడని ఒప్పుకున్నట్టే. మరి శేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus