షూటింగ్లో అనుకోకుండా జరిగిన ఘోర ప్రమాదాలు.. గాయపడ్డ నటులు ఎవరో తెలుసా?

మనకి స్ట్రెస్ రిలీఫ్ లాంటిది సినిమా..! ఎన్ని ఇబ్బందులతో మనం సతమతమవుతున్నా.. వాటి నుండీ మనల్ని ఉత్సాహపరిచేది సినిమా మాత్రమే. అయితే కొన్ని కొన్ని సార్లు సినిమానే ప్రాణం అనుకునే వాళ్లకు కూడా కడుపుకోత మిగులుస్తుంటుంది.అయితే ఆ సినిమా కొనేవాళ్ళకో.. నిర్మించే వాళ్ళకో కాదు..! ఒక సినిమా తయారవ్వడం వెనుక ఎంతో మంది కష్టం ఉంటుంది. యూనిట్ సభ్యులు ఎంతో మంది చమటలు చిందిస్తే సినిమా తయారవుతుంది. అయితే అదే సినిమా.. పలు సందర్భాల్లో కొందరి ప్రాణాలను తీసుకోవడం అలాగే చాలా మందిని ప్రమాదానికి గురిచేయడం కూడా జరిగింది. అవి ఏ ఏ సినిమాల్లో సంభవించాయో.. ఏ నటులకు, యూనిట్ సభ్యులకు సంభవించాయో తెలుసుకుందాం రండి :

1) బామ్మ మాట బంగారు బాట: ఈ చిత్రంలో ఓ కార్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్న సమయంలో క్రేన్ కు కారుని వేలాడదీశారు. అయితే సడెన్ గా ఆ కారు కిందికి పడిపోయింది. చాలా ఎత్తునుండీ పడిపోవడంతో నూతన ప్రసాద్ గారు రెండు కాళ్ళను కోల్పోయారు.

2) ఇండియన్ 2: శంకర్- కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.యూనిట్ సభ్యుల్లో ఏకంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

3) బృందావనం(2010): ఎన్టీఆర్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం క్లయిమాక్స్ పార్ట్ చిత్రీకరిస్తున్న సమయంలో.. ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యాడు.

4) రచ్చ: రాంచరణ్ – సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్లో ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నప్పుడు ఘోర ప్రమాదం నుండీ రాంచరణ్ తప్పించుకున్నాడు.

5) బిందాస్: మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో.. రిస్కీ షాట్లలో పాల్గొన్నాడు హీరో. ఆ టైములో మనోజ్ కు చిన్న యాక్సిడెంట్ జరిగింది. స్వల్పగాయాలతోనే బయటపడ్డాడు లెండి.

6) వరుడు: అల్లు అర్జున్ – గుణశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తున్న సమయంలో.. అల్లు అర్జున్ చెయ్యి విరిగింది.

7) స్పైడర్: మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఈ క్రమంలో మహేష్ బాబుకు ఘోర ప్రమాదం తప్పింది.

8) ఆది: ఎన్టీఆర్ – వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ షూటింగ్ సమయంలో.. ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయ్యింది. ఈ క్రమంలో అతని చెయ్యికి గాయమవ్వడం కూడా జరిగింది.

9) జాను: శర్వానంద్, సమంత.. ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘జాను’ చిత్రం షూటింగ్ సమయంలో.. శర్వానంద్ కు చిన్న యాక్సిడెంట్ అయ్యింది.

10) అశ్వద్ధామ: నాగశౌర్య హీరోగా రమణతేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అశ్వద్ధామ’ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యింది. అయితే షూటింగ్ సమయంలో హీరో నాగశౌర్య కు చిన్న యాక్సిడెంట్ అయ్యింది.

11) బలాదూర్: రవితేజ, అనుష్క జంటగా నటించిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో చిన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో రవితేజ డూప్ గా కనిపించాల్సిన వ్యక్తి ప్రాణాలుకోల్పోయాడు.

12) సైనికుడు: మహేష్ బాబు – గుణశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఓ వరద ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నప్పుడు యూనిట్ సభ్యుల్లో ఓ వ్యక్తి మరణించాడు.

 

వీళ్ళు మాత్రమే కాదు సీనియర్ ఎన్టీఆర్,కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, యాక్షన్ కింగ్ అర్జున్ వంటి హీరోలు షూటింగ్ సమయంలో గాయపడిన సందర్భాలు ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus