ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విజయ్ సేతుపతి (Hero)
  • రుక్మిణి వసంత్ (Heroine)
  • యోగి బాబు,బి.ఎస్. అవినాష్,జయప్రకాష్,బబ్లూ పృథివీరాజ్,దివ్య పిళ్ళై,పూజిత పొన్నాడ (Cast)
  • అరుముగ కుమార్ (Director)
  • అరుముగ కుమార్ (Producer)
  • సామ్ సిఎస్ (Music)
  • కరణ్ బి. రావత్ (Cinematography)
  • Release Date : మే 23 , 2025

విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా తెరకెక్కిన 51వ సినిమా “ఏస్” (Ace). తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రంతో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) తమిళనాట హీరోయిన్ గా పరిచయమైంది. అరుముగకుమార్ (Arumuga Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ పద్మిని సినిమాస్ పతాకంపై డి.శివప్రసాద్ అనువాద రూపంలో తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాకి మంచి పాజిటివ్ బజ్ ఉంది, మరి ఆ బజ్ ని సినిమా ఏ స్థాయిలో వినియోగించుకుందో చూద్దాం..!!

ACE Review

కథ: బోల్ట్ కన్నన్ (విజయ్ సేతుపతి) పని వెతుక్కుంటూ మలేసియా వస్తాడు. అక్కడ జ్ఞానం (యోగిబాబు) (Yogi Babu) సహాయంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తుంటాడు. ఎదురింటి అమ్మాయి రుక్మిణి (రుక్మిణి వసంత్) ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకొని, ఆమె కోసం ఓ దొంగతనం చేయాలని ప్లాన్ చేస్తాడు.

అసలు బోల్ట్ కన్నన్ ఏం చేసేవాడు? అతను దొంగతనం ఎలా చేశాడు? ఆ దొంగతనం వల్ల వచ్చిన సమస్యలు ఏమిటి? ఆ సమస్యల నుంచి అందర్నీ కన్నన్ ఎలా బయటపడేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఏస్”(Ace) చిత్రం.

నటీనటుల పనితీరు: విజయ్ సేతుపతి మార్క్ అనేది సినిమాలో కరెక్ట్ గా కనిపించలేదు. ఎలాంటి పాత్రలోనైనా తనదైన మార్క్ నటనతో ఆకట్టుకునే సేతుపతి ఈ సినిమాలో మాత్రం పాటలు మినహా సన్నివేశాల్లో చాలా లేజీగా కనిపించాడు. యాక్షన్ బ్లాక్ అయితే ఏదో బలవంతంగా చేసిన భావన.

రుక్మిణి వసంత్ నేచురల్ బ్యూటీని ఒక్క పాటలో మాత్రమే వినియోగించుకోగలిగారు. ఆమె క్యారెక్టర్ కు సరైన ఆర్క్ లేదు. అందువల్ల ఆమె పాత్ర ఒక నేచురల్ డాల్ గా మిగిలిపోయింది.

దివ్య పిళ్లై (Divya Pillai) పరిస్థితి కూడా అంతే. ఏదో ఫీమెల్ బ్యూటీ ఉండాలి అని ఆ పాత్రలో ఆమెను తీసుకున్నట్లు ఉంటుంది.

యోగిబాబు మాత్రం చాన్నాళ్ల తర్వాత హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసాడు. తెలుగు వెర్షన్ డైలాగ్స్ గట్టిగా పేలాయి. ఆ విషయంలో తెలుగు వెర్షన్ రైటర్స్ ను మెచ్చుకోవాలి.

బబ్లూ పృథ్వీరాజ్ (Babloo Prithiveeraj) , బి.ఎస్.అవినాష్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: జస్టిన్ ప్రభాకరన్ (Justin Prabhakaran) పాటలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా విజయ్ సేతుపతి-రుక్మిణి వసంత్ కాంబినేషన్ లో వచ్చే మొదటి పాట ఎన్నిసార్లు విన్నా అలసట రాని విధంగా ఉంది. ఆ పాటలో ఆ ఇద్దరి కెమిస్ట్రీ కూడా క్యూట్ గా ఉంది. నేపథ్య సంగీతం డీసెంట్ గా ఉంది.

సినిమాటోగ్రఫీ వర్క్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. డ్రోన్ షాట్స్ తో చాలావరకు మ్యానేజ్ చేయడానికి ట్రై చేశారు. సినిమాటిక్ షాట్స్ ఇంకాస్త ఎక్కువగా ఉండాల్సింది. అప్పుడే మాస్ ఎలిమెంట్స్ ప్రోపర్ గా ఎస్టాబ్లిష్ అయ్యేది.

లెంగ్త్ తగ్గించడం కోసం కట్ చేశారో లేక షూట్ కంప్లీట్ చేయని సీన్స్ ని మ్యానేజ్ చేయడం కోసం కట్ చేశారో తెలియదు కానీ.. చాలా చోట్ల ఎడిట్ ట్రాన్సిషన్ బాలేదు. కొన్ని జంప్ కట్స్ మరీ ఇబ్బందిగా ఉన్నాయి.

శ్రీ పద్మిని సినిమాస్ సంస్థ అధినేత శివప్రసాద్ “ఏస్” డబ్బింగ్ వెర్షన్ లో తీసుకున్న కేర్ ను మెచ్చుకోవాలి. టైటిల్ కార్డ్స్ మొదలుకొని డైలాగ్స్ వరకు ప్రతీది చాలా నీట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ పెట్టడానికే కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు బద్ధకిస్తున్న తరుణంలో ఈ బృందం తీసుకున్న జాగ్రత్తను ప్రశంసించాలి.

దర్శకుడు అరుముగకుమార్ సింపుల్ కథను, టిపికల్ స్క్రీన్ ప్లేతో ప్రెజంట్ చేయాలనుకున్నాడు. కొన్ని హై పాయింట్స్ ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లే లో క్లారిటీ లోపించడం అనేది మైనస్ గా నిలిచింది. అలాగే.. హీరో తీసుకునే నిర్ణయాలు కథనానికి, కథలోని పాత్రలకి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అందువల్ల.. మంచి కంటెంట్ ఉన్న సెకండాఫ్ కూడా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్ గా దర్శకుడు అరుముగకుమార్ “ఏస్” చిత్రంలో ఓ మోస్తరుగా మాత్రమే ఆకట్టుకున్నాడని చెప్పాలి.

విశ్లేషణ: యాక్షన్ డ్రామాలకు థ్రిల్లింగ్ పాయింట్స్ అనేవి చాలా కీలకం. వాటిని ఎంతగా ఎస్టాబ్లిష్ చేసి, ట్విస్టులను ఎంత చక్కగా ఎలివేట్ చేస్తే సినిమా అంత ఎగ్జైట్ చేస్తుంది. “ఏస్” సినిమాలో ఆ ఎగ్జైట్మెంట్ మిస్ అయినప్పటికీ.. విజయ్ సేతుపతి-యోగిబాబుల కామెడీ టైమింగ్, రుక్మిణి వసంత్ స్క్రీన్ ప్రెజన్స్ & జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఈ చిత్రాన్ని యావరేజ్ గా నిలిపాయి.

ఫోకస్ పాయింట్: టైంపాస్ థ్రిల్లర్!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus