‘యాక్షన్’ క్లోజింగ్ కలెక్షన్స్..!

విశాల్, తమన్నా జంటగా సుందర్.సి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘యాక్షన్’. నవంబర్ 15న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ టాక్ ను రాబట్టుకున్నప్పటికీ కలెక్షన్లను రాబట్టలేక డిజాస్టర్ గా మిగిలింది. విశాల్ కెరీర్లోనే ఇది హై బడ్జెట్ మూవీ కావడం… తెలుగు రాష్ట్రాల్లో కూడా విశాల్ సినిమాలకు మంచి క్రేజ్ ఉండడంతో భారీ స్థాయిలో విడుదల చేశారు. మొదటి వీకెండ్ ను పక్కన పెడితే ‘యాక్షన్’ చిత్రం పెద్దగా నిలబడలేకపోయిందనే చెప్పాలి.

ఇక ‘ ‘యాక్షన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా…. ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం 2.91 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే 50 శాతం పైనే నష్టాల్ని మిగిల్చిందన్న మాట. విశాల్ గత చిత్రం ‘పందెం కోడి2’ కి యావేరేజ్ టాక్ వచ్చినప్పటికీ 6.7 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ గా నిలిచింది. కానీ ఎబొవ్ యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ‘యాక్షన్’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సుందర్.సి సినిమాలకు పెద్దగా క్రేజ్ లేకపోవడమే అని ట్రేడ్ పండితులు క్లారిటి ఇచ్చారు.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus