‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ బాబును చూసి చాలా మంది హీరోలు గ్రామాలను దత్తత తీసుకుని తమ వంతు సాయం చేస్తున్నారు. మహేష్ బాబుతో సహా, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు కూడా ఈ గొప్ప పనిలో భాగమైన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మంది నటీనటులు తమ సొంత ఊర్లకు తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్ హీరో ఆదిత్య ఓం కూడా చేరాడు. ఇతను గతంలో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘ధనలక్ష్మి ఐ లవ్ యు’ ‘ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు’ ‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు’ ‘మా అన్నయ్య బంగారం’ వంటి సినిమాల్లో నటించాడు.
పలు హిందీ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆదిత్య ఓం. దర్శకుడిగా కూడా మారి తనదైన ముద్ర వేసుకుంటున్న ఆదిత్య ఓం సేవారంగంలో తన ఔదార్యాన్ని చాటుతున్నాడు.ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి మంచి పనులు చేశాడు. ఇతను తెలంగాణలోని భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా చేరుపల్లి లోని 5 గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మంది అవస్రతలు తీర్చిన ఆదిత్య ఓం తాజాగా కొత్తగూడెం జిల్లా మరియు తాండూరులోని చెరుపల్లి, కొత్తపల్లి మరియు పరిసర ప్రాంతాలకు అంబులెన్స్ సేవలను అందించడానికి శ్రీకారం చుట్టాడు.
అక్కడి గిరిజన గ్రామాల్లో చాలా కాలంగా పనిచేస్తున్న ఆదిత్య ఓం కోవిడ్ సమయంలో అంబులెన్స్ సేవలు లేకపోవడం మరియు ఆ ప్రాంతంలో పాము కాటు కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చూసి చలించారు. దాంతో అక్కడ పేరుగాంచిన రోటరీ క్లబ్ మరియు దానికి సంబంధించిన స్థానిక సంస్థల ఆర్థిక సహాయంతో ఈ ప్రాంతాలకు అంబులెన్స్ సేవలు అందించగలిగాడు.
తన స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు అందించిన సహాయం మరియు స్థానిక ప్రజల అవగాహన కారణంగా ఇది సాధ్యం అయ్యింది అంటూ అతను చెప్పుకొచ్చాడు. ఈ గొప్ప పని వల్ల చాలా మంది ప్రాణాలు నిలబడతాయని అతను తెలిపాడు.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!