‘అలీ నా గుండె… అలీ లేకుండా సినిమా చేస్తే నాకేదో అసంతృప్తిగా ఉంటుంది’… ఈ మాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పేవారు. అలీ – పవన్ మంచి స్నేహితులని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో పవన్ జనసేన పార్టీ పెట్టినప్పుడే… అలీ కూడా ఆ పార్టీలో చేరడం ఖాయమని అంతా అనుకున్నారు, అయితే అలా జరుగలేదు… పవన్ తన పార్టీ.. ఎన్నికల హడావుడిలో బిజీగా ఉండగా… అలీ మాత్రం ఒక పక్కన టీడీపీ.. మరో పక్క వైసీపీ పార్టీల చుట్టూ తిరుగుతూ జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు.
ఈ విషయం గురించి అలీని ప్రశ్నించగా… ఓ ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ ఈ విషయం పై స్పందిస్తూ… “పవన్ కళ్యాణ్ గారు ‘నా పార్టీలోకి రా’ అని ఎప్పుడూ పిలవలేదు. ఆయన పార్టీ పెడుతున్న విషయం నాకు ముందే తెలుసు, కానీ పవన్ ఎప్పుడూ ఆ విషయాలను డిస్కస్ చేయలేదు. పవన్ జనసేన పార్టీ స్థాపించిన తరువాత ఆయన దగ్గరకి నేను వెళ్ళలేదు, ఆయన కూడా నన్ను పార్టీలో చేరమని అడగలేదు.
ఆయన తన సొంత వాళ్ళు ఇబ్బంది పడితే చూడలేరు, నేను పార్టీలో చేరిన తరువాత ఇబ్బంది పడతానేమో అనే కారణంగానే నన్ను పిలిచి ఉండక పోవచ్చు… అంటూ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఓ వైపు జగన్, చంద్రబాబులతో పోరాటం చేస్తుంటే మీరు ఆ పార్టీలో కలవడం ఏంటి..? అనే ప్రశ్నకు అలీ బదులిస్తూ .. “నేను టీడీపీ మనిషినని పవన్ కి తెలుసు. అప్పుడప్పుడు ఆయన కూడా ఎన్నికలు వస్తున్నాయి కదా.. టికెట్ వస్తుందా అని నన్ను అడిగేవారు.., నేను పాలనా పార్టీలోకి వెళ్ళినా.. అయన అర్ధం చేసుకుంటారు. నా పర్సనల్ లైఫ్ కి సంబంధించి అంటే .. నా భార్య.. నా పిల్లలు యోగ క్షేమాలు ఎప్పుడూ అడుగుతుంటారు.. ఏమైనా లోటు ఉంటే ఆయనే పర్సనల్ గా తీసుకుని నన్ను తిడతారు. అంత చనువు మాకు ఉంది. అయితే ప్రొఫెషనల్ గా అయన ఎవ్వరినీ ఇబ్బంది పెట్టరు… ప్రశ్నించరు..! అయినా స్నేహం వేరు… పార్టీ వేరు… ఇక నాకు ఏ పార్టీ మంత్రి పదవి ఇస్తుందో ఆ పార్టీలోకి వెళ్తానను” అంటూ ఆసక్తికరమైన సమాధానాలిచ్చాడు అలీ..!