రాజకీయాలకి గుడ్ బై చెప్పిన బండ్ల గణేష్..!

  • April 5, 2019 / 01:03 PM IST

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చేసిన హడావిడి అంతా.. ఇంతా కాదు. ‘ఈ ఎన్నికల్లో కచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది… మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మంచి ఎండలు కాస్తాయి.. మంచిగా వర్షాలు కురుస్తాయి’ అంటూ ఓ రేంజ్లో కామెడీ చేసాడు. అంతేకాదు మా కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ‘7 ఓ క్లాక్ ‘ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని… ఆ బ్లేడ్ కంపెనీ వారిని మరింత పాపులర్ చేసాడు. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ రాజకీయాలనుండి తప్పుకుంటున్నాడట.

ఈ విషయాన్ని స్వయంగా బండ్ల గణేషే.. తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు… “నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను…. మీ బండ్ల గణేష్” అంటూ పేర్కొన్నాడు బండ్ల గణేష్. ఇక రాజకీయాలనుండీ బయటపడ్డాడు కాబట్టి… సినిమాలతో బిజీ అవుతాడేమో అని కొందరు ఫిలింనగర్ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus