Actor: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడి ఇంట తీవ్ర విషాదం!

ప్రముఖ సీనియర్‌ నటుడు, దర్శకుడు బోస్‌ వెంకట్‌ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు ఆయన ఇంట్లో రెండు మరణాలు సంభవించాయి. ఆయన సోదరి, బావమరిది గుండెపోటు కారణంగా మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బోస్‌ వెంకట్‌ సోదరి వలర్‌మతి నిన్న గుండెపోటు కారణంగా చెన్నైలోని తన నివాసంలో మరణించారు. కుటుంబసభ్యులు ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ అంత్యక్రియల సందర్బంగా బోస్‌ వెంకట్‌ బావమరిది రంగనాథన్‌ తీవ్ర మనోవేధనకు గురయ్యారు.

వలర్‌మతి భౌతిక దేహాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. కొద్ది సేపటి తర్వాత ఉన్నట్టుండి వలర్‌మతి భౌతిక దేహంపై పడిపోయారు. ఆయన ఎంతకీ పైకి లేవకపోవటంతో కుటుంబసభ్యులు ఆయన్ని పట్టి లేపే ప్రయత్నం చేశారు. ఆయనలో చలనం లేకపోవటంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రంగనాథన్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లు ధ్రువీకరించారు. గుండెపోటు కారణంగా రంగనాథన్‌ చనిపోయాడని వెల్లడించారు.

ఒకే రోజు ఇద్దరు సభ్యులు మరణించటంతో (Actor) బోస్‌ వెంకట్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదంపై రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. బోస్‌ వెంకట్‌ కుటుంబానికి తమ సంతాపం తెలియజేస్తున్నారు. వలర్‌మతి, రంగనాథన్‌ అంత్యక్రియలు ఈ రోజు పుదుకోట్టై జిల్లాలోని వారి స్వస్థలం అరంతంగిలో జరిగే అవకాశం ఉంది. కాగా, బోస్‌ వెంకట్‌ బుల్లి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ ఆయన తన సత్తా చాటారు. విలన్‌గా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించారు. దర్శకుడిగా 2020లో ‘కన్నిమడమ్‌’ అనే సినిమాను తీశారు. ప్రస్తుతం బోస్‌ వెంకట్‌ స్మాల్‌ స్క్రీన్‌ యాక్టర్స్‌ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus