ఫ్రీగా యాక్ట్ చేస్తానంటున్న బ్రహ్మీ..!

టాలీవుడ్లో బ్రహ్మానందం స్టార్ కమెడియన్. బ్రహ్మీ లేకుండా ఏ స్టార్ హీరో సినిమా కూడా ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. ప్లాపుల్లో ఉన్న హీరోలందరూ బ్రహ్మానందం కామెడీతో హిట్ ట్రాక్ ఎక్కేసిన హీరోలు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ‘జల్సా’, మహేష్ బాబు ‘దూకుడు’, రామ్ ‘రెడీ’, విష్ణువర్ధన్ ‘ఢీ’, రవితేజ ‘బలుపు’, గోపీచంద్ ‘లౌక్యం’ వంటి హిట్ చిత్రాలకి ముందు ఈ హీరోలందరూ ప్లాఫుల్లో ఉన్నవాళ్ళే. అంతలా బ్రహ్మి కామెడీ పనిచేసింది. అయితే ఇదంతా ఒకప్పటి మాట… ఇప్పటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యంగ్ కమెడియన్లు పెరగడంతో బ్రహ్మీ కామెడీకి డిమాండ్ తగ్గిపోయింది.

దీంతో బ్రహ్మీకి అవకాశాలు బాగా తగ్గాయి. ఇటీవల ఆయనకి గుండె ఆపరేషన్ జరగడంతో ఇక బ్రహ్మీ సినిమాల నుండీ పూర్తిగా తప్పుకుంటారని అంతా భావించారు. కానీ బ్రహ్మీ మాత్రం ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాల పైన పెట్టాలని డిసైడ్ అయ్యాడట. దీంతో పాటు తన పారితోషికాన్ని కూడా తగ్గించుకోవాలని చూస్తున్నాడట. అప్పట్లో రోజుకి ఆరు లక్షల రెమ్యునరేషన్ తీసుకునేవాడు బ్రహ్మీ. రెమ్యునరేషన్ విషయంలో అస్సలు రాజీ పడేవాడు కాదట. చిన్న సినిమా.. పాత్రకి ఏమాత్రం ప్రాధాన్యత లేని సినిమా అయినా.. రెమ్యూనరేషన్ కోసమే చేసేవాడట. అయితే ఇప్పుడు అలా ప్రాధాన్యం లేని సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నాడట బ్రహ్మీ. అయితే తనకు నచ్చే పాత్రలు కొన్ని ఉన్నాయట, అవి మాత్రం దొరికితే రెమ్యునరేషన్ లేకుండా కూడా ఫ్రీ చేస్తానని బ్రహ్మీ కొందరి సినీ ప్రముఖుల దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనా బ్రహ్మీ తీసుకున్న ఈ నిర్ణయంతో మంచి పత్రాలు వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus