Chinna: మహేష్ మంచితనం గురించి చెప్పిన నటుడు చిన్నా.. ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగ రోజు అనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా మురారి (Murari)  మూవీ రీరిలీజ్ అవుతుండగా ఈ సినిమా రీరిలీజ్ బుకింగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మురారి సినిమాలో కీలక పాత్రలో నటించిన చిన్నా ఈ సినిమాకు సంబంధించి, మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. రామచంద్రాపురం అనే గ్రామంలో మురారి మూవీ షూటింగ్ జరిగిందని అయితే ప్రొడక్షన్ ఫుడ్ నాకు పడేది కాదని చిన్నా (Chinna) వెల్లడించారు.

Chinna

నేను ఔట్ డోర్ షూటింగ్ లో ఉండటంతో ఇంటి నుంచి బాక్స్ వచ్చే అవకాశం కూడా లేదని ఆయన తెలిపారు. మహేష్ బాబుకు ప్రొడ్యూసర్ చెల్లెలి ఇంటి నుంచి ఫుడ్ వచ్చేదని నేను మహేష్ బాబును కలిసి నా సమస్యను వివరించగా తనతో పాటు వచ్చి ఫుడ్ తినాలని మహేష్ చెప్పారని చిన్నా అన్నారు. కొన్నిసార్లు మహేష్ షూటింగ్ వల్ల మీరు తినేయండి నేను తర్వాత తింటానని చెప్పి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారని మహేష్ మమ్మల్ని అంత బాగా చూసుకున్నారని చిన్నా వెల్లడించారు.

చిన్నా చెప్పిన విషయాలు విని మహేష్ బాబును నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు. ఇతర ఆర్టిస్టులతో అంత ప్రేమగా వ్యవహరించే హీరోలు ఎంతమంది ఉంటారని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి మూవీ షూటింగ్ తో త్వరలో బిజీ కానున్నారు. మహేష్ రాజమౌళి (S. S. Rajamouli) కాంబో మూవీ సంచలనాలు సృష్టించే మూవీ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2027 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ బాబు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ బాబు సైతం 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోల జాబితాలో ఉన్నారు.

పవన్ కళ్యాణ్ మూవీలో లెజెండరీ యాక్టర్.. అంచనాలు పెంచేశారుగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus