నందమూరి హరికృష్ణ నటుడిగా, పొలిటికల్ లీడర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ దంపతులకు మూడో సంతానంగా జన్మించిన హరికృష్ణ సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య మరికొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. హరికృష్ణ వైవీఎస్ చౌదరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనిపించుకుంది. అయితే లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో ఒక సీన్ కోసం హరికృష్ణ ప్రాణాలను రిస్క్ లో పెట్టారట.
ఈ సినిమాలోని ఒక సీన్ లో హరికృష్ణ కారు, విలన్ రోల్ పోషించిన జయప్రకాష్ రెడ్డి కారు ఎదురెదురుగా వచ్చి రైల్వే ట్రాక్ మధ్యలో ఆగిపోతాయి. హరికృష్ణ కారు ముందుకు వెళ్లాల్సి ఉండగా అదే సమయంలో కారు ట్రబుల్ ఇచ్చింది. మరోవైపు ట్రైన్ వస్తుండగా హరికృష్ణ మూడుసార్లు ప్రయత్నించి మూడోసారి కారు స్టార్ట్ చేశారు. కారు నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్నా ఆయన మాత్రం అలా చేయలేదు.
కారు స్టార్ట్ కావడం ఏ మాత్రం ఆలస్యమైనా ఆయన ప్రాణాలు ప్రమాదంలో పడేవి. (Harikrishna) హరికృష్ణ తన సినీ కెరీర్ లో ఇలాంటి రిస్క్ లు చేశారని నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. చనిపోయే వరకు వివాదాలకు దూరంగా హరికృష్ణ జీవనం సాగించారు. తన ఇద్దరు కొడుకులను కెరీర్ పరంగా సక్సెస్ చేయడం కోసం హరికృష్ణ ఎంతో కష్టపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా కళ్యాణ్ రామ్ నటుడిగా, నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ను ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. అద్భుతమైన స్క్రిప్ట్ వస్తే కలిసి నటించడానికి అభ్యంతరం లేదని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చాలా సందర్భాల్లో బహిరంగంగా చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పారితోషికాలు సైతం భారీగానే ఉన్నాయి.