బుల్లితెర నటుడు కౌశిక్ అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా 10 సినిమాలు అలాగే… ‘ఆరుగురు పతివ్రతలు’, ‘శీను వాసంతి లక్ష్మీ’ వంటి చిత్రాల్లో కూడా నటించాడు. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండీ 18వ ఈసీ మెంబర్ గా గెలుపొందాడు. అయితే అనంతరం తన ప్యానల్ సభ్యులతో కలిసి రాజీనామా కూడా చేశాడు. బ్యాలెట్ బాక్సులు తెరవకుండానే ఎన్నికల ఫలితాలను ప్రకటించేసిన పలు మీడియా ఛానల్స్ పై కూడా ఇతను మండిపడ్డాడు.
ఇదిలా ఉండగా.. గతంలో కౌశిక్.. టీవీ ఆర్టిస్టుల సమస్యల పై పోరాడి జైలుకి కూడా వెళ్ళిన సంగతి తెలిసిందే.అతను తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అతని జైలు అనుభవాలను చెప్పుకొచ్చాడు. “చంచల్ గూడ జైల్లో నేను గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను.దాని వల్ల అమెరికా వెళ్లే అవకాశం కూడా కోల్పోయాను.ఇక జైల్లోకి వెళ్లగానే రిజిస్టర్ లో సంతకం పెట్టించుకుని, లోపలికి తీసుకేెళ్లి బట్టలు విప్పించారు. ఒంటి పై ఉన్న మొలతాడుతో సహా ఏమైనా తాడులు వంటివి ఉంటే కట్ చేసేవారు.
డార్క్ రూంలో బట్టల్లేకుండా నిలబెట్టి అన్నీ చెక్ చేసేవారు.అవి చూసినప్పుడు నా మతిపోయింది. ఐతే నా మొహం చూసి గుర్తుపట్టిన కానిస్టేబుల్, డ్రాయర్ వేసుకోమని చెప్పాడు. దాంతో నేను కాస్త ఊపిరి పీల్చుకున్నాను.నేను జైల్లో ఉన్నప్పుడు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఉండేవారు.అయితే ఆయన్ని నేను ఎప్పుడూ కలవలేదు. జగన్ గారు వీఐపీ బరాక్‌లో ఉండేవారు.నేను జనరల్ బరాక్ లో ఉండేవాడిని.