నటిగా పలు సందర్భాల్లో తను ఎదుర్కున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి, ఆ సమయంలో తను రియాక్ట్ అయిన తీరు గురించి కూడా ఖుష్బూ తాజాగా మాట్లాడారు. ‘‘మీరు ఏ సినిమా తీసుకున్నా ఎమోషన్స్ గురించే ఎక్కువగా ఉంటాయి అంటుంటారు. కానీ మేము, సౌత్ ఇండియన్స్ అలాగే ఉంటాము. ఎప్పుడూ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడతాము. దానికి మేమేం సిగ్గుపడము. అవును మేము హీరోలను దేవుళ్లలాగా పూజిస్తాము. అది కూడా ఇష్టపడే చేస్తాము. మేము రజినీకాంత్‌ను ఆదరిస్తాము, కమల్ హాసన్‌ను ఆదరిస్తాము, విజయ్, అజిత్..
ఇలా అందరినీ వారు ఎలా ఉంటే అలా ఇష్టపడతాము, ఆదరిస్తాము. ఇలా హీరోలను ఆదరించడం అనేది చాలా ఏళ్ల నుండి ఉంది. ఇప్పటికీ అలాగే ఆదరిస్తున్నాం కూడా. మలయాళంలో తెరకెక్కుతున్న సినిమాలు చాలా గొప్పగా ఉంటున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్’లాంటి సినిమాలతో మణిరత్నం మనకు హిస్టరీ అంటే ఏంటో చూపిస్తున్నారు. ‘విక్రమ్’లాంటి సినిమాలతో కమల్ హాసన్ ఎలాంటి యాక్షన్ చూపిస్తున్నారో చూస్తున్నాం. ఇవే కాకుండా జైలర్, ఆర్ఆర్ఆర్, బాహూబలి లాంటివి కూడా చూశాం.
మేము ఎప్పుడూ బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం. రెహమాన్, రసూల్ కుట్టీ, కీరవాణి, రామ్ చరణ్.. ఇలా ఎవరి గురించి తీసుకున్నా.. మేము సాధించి చూపించాం’’ అని పేరుపేరునా అందరి గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు ఖుష్బూ. సినిమాలతో పాటు తను నిజ జీవితంలో ఎదుర్కున్న ఒక చేదు అనుభవాన్ని కూడా గుర్తుచేసుకున్నారు ఈ సీనియర్ నటి. ‘‘ఓ రాజకీయ ర్యాలీలో ఒకరు నాతో అనుచితంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారు. అందుకే అతడిని చెప్పుతో కొట్టాను’’ అని బయటపెట్టారు (Kushboo) ఖుష్బూ.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు