ఏ నటుడికైనా మొదటి సినిమాతోనే గుర్తింపు దక్కుతుంది అని చెప్పలేం. గుర్తింపు రానంత మాత్రాన నటీనటులు పోషించిన ఆ పాత్రలు వ్యర్థం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అవి అవకాశాలు గా పరిగణించాలి అంతే.! ప్రతి పాత్రను జనాలు కూడా ఓన్ చేసుకుంటారు అన్న గ్యారెంటీ ఉండదు. ఒకసారి ఓన్ చేసుకుంటే మాత్రం.. ఆయా నటీనటులను అభిమానించడం స్టార్ట్ చేస్తుంటారు. తర్వాత ఆ నటీనటులు డెడికేషన్ తో పనిచేస్తే..
వాళ్ళ కెరీర్ బాగుంటుంది. చాలా వరకు సంపాదించుకోవచ్చు..! అయితే బాగా బ్రతికిన ఒకప్పటి నటీనటులు.. వారు పోయే ముందు చిల్లి గవ్వ కూడా లేకుండా ఆర్థిక ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో మహానటి సావిత్రి కూడా ఉన్నారు అంటే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా క్యారెక్టర్ ఆరిస్ట్ లు ఆర్థికంగా ఇబ్బంది పడటానికి గల కారణాలను నటుడు నాగినీడు బయటపెట్టారు.
నటుడు నాగినీడు అందరికీ సుపరిచితమే. ఈయన పేరు చెప్పగానే అందరికీ ‘మర్యాద రామన్న’ చిత్రం గుర్తొస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ సినిమాలో రామినీడు పాత్ర ఈయనకు ఓ రేంజ్లో గుర్తింపు తెచ్చిపెట్టింది. నిజానికి ఆయనకు అది మొదటి చిత్రం కాదు. ‘మర్యాదరామన్న’ చిత్రం 2010 లో వచ్చింది. అయితే 2002 లోనే ఆయన ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో నటించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఆర్థిక ఇబ్బందులు పడటానికి కారణాలను ఈయన వివరించారు.
“ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడపడాన్ని అలవాటు చేసుకుంటారు. అదే సమయంలో వ్యసనాలకు కూడా బానిసలు అయిపోతారు. ఇంకొంతమంది అయితే అత్యాశకు పోయి తాము సంపాదించింది అంతా సినిమా నిర్మాణంలో పెట్టేస్తారు. అందుకే వారికి అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది” అంటూ నాగినీడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?