అమ్మకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన నాని.!

డబ్బు సంపాదనే ద్యేయంగా కాకుండా కొంతమంది తమ వృత్తిని దైవంగా భావిస్తారు. నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. అటువంటి వారిలో విజయలక్ష్మి ఒకరు. ఆమె ఎవరో కాదు నాని తల్లి. ముపై ఏళ్లుగా ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు హీరోగా ఎదిగా బాగా సంపాయిస్తున్నప్పటికీ తన వృత్తిని వదల్లేదు. డెడికేషన్ తో పని చేస్తూ అటు వైద్యులకు, ఇటు రోగులకు అభిమాన ఫార్మాసిస్ట్‌గా గుర్తింంపు తెచ్చుకున్నారు.

ఈరోజు ఆమె ఉద్యోగానికి చివరిరోజు. ఈ సందర్భంగా నాని షూటింగ్ పనులను వదిలి అమ్మదగ్గరకు వెళ్ళారు.  పదవీవిరమణ శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికపై అమ్మతో కలిసి తీసుకున్న ఫోటోని షేర్ చేస్తూ పత్యేకంగా ట్వీట్ చేశారు. “ఫార్మాసిస్ట్‌గా 30 ఏళ్ల అనుభవం. ఎప్పుడూ నవ్వుతూ, ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటుంది. వైద్యులు, రోగులు ఆమెను ఎంతో ఇష్టపడతారు. మేం అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాం. ఈ రోజు ఆమె చివరి వర్కింగ్ డే. చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు చాలా అందమైన వ్యక్తివి” అంటూ నాని ట్వీట్ చేశారు. దీంతో నాని అభిమానులు, నెటిజనులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus