కొరటాల శివ తో సినిమా గురించి స్పందించిన నాని.!

తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆయన తీసిన మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ చిత్రాలు సమాజానికి సందేశానిస్తూనే కమర్షియల్ హిట్ సాధించాయి. ఇప్పుడు మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా రూపొందించారు. ఈ మూవీ ఈనెల 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కొరటాల నానితో సినిమా చేయబోతున్నట్టు వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నాని ఈరోజు స్పందించారు. వరుస విజయాలతో దూసుకు పోతున్న నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేసిన కృష్ణార్జున యుద్ధం ఈరోజు రిలీజ్ అయింది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన నాని తనపై వచ్చిన వార్తను ఖండించారు. “నిన్నుకోరి” సినిమా షూటింగు సమయంలో కొరటాల శివ గారిని ఒకసారి కలిశానంతే.

ఆ తరువాత ఆయనను కలుసుకునే సందర్భం కూడా రాలేదు. ఆయన తదుపరి సినిమాను గురించి నన్ను సంప్రదించలేదు. ఆయన నెక్స్ట్ మూవీ నేను చేయనున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. మిగతా ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయి .. అవి ఓకే అయితే నేనే చెబుతాను” అని నాని క్లారిటీ ఇచ్చారు. కృష్ణార్జున యుద్ధం తర్వాత నాని నాగార్జునతో కలిసి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో నాగార్జునకు తమ్ముడిగా నాని కనిపించబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus