Naresh, Prakash Raj: మగోళ్ల ఏడుపును నమ్మొద్దు… ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌పై నరేష్ ఘాటు వ్యాఖ్యలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికలు ముగిశాయని సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నప్పటికీ వివాదాలు, విమర్శలకు మాత్రం ఫుల్‌స్టాప్‌ పడకపోగా.. మరింత పెరిగాయి. ముఖ్యంగా ఎన్నికలు జరిగిన తీరు, కౌంటింగ్, మోహన్ బాబు ప్రవర్తన తదితర అంశాలపై నొచ్చుకున్న ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్‌ నుంచి గెలిచిన 11 మంది సభ్యులతో రాజీనామా చేయించి కొత్త వివాదానికి తెరదీశారు. ఇదే సమయంలో కౌంటింగ్ సందర్భంగా అవకతవకలు జరిగాయని ప్రకాశ్ రాజ్ ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు.

ఈ సందర్భంగా సీనియర్ నటుడు బెనర్జీ, యువ హీరో తనీష్, నటుడు ఉత్తేజ్‌లు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రధానంగా మోహన్ బాబు, నరేశ్‌లను టార్గెట్ చేసుకుంటూ వీరు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో నరేశ్ బుధవారం మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ప‌ద్ధ‌తిలో సభ్యులంతా చూస్తుండగానే ఎన్నికలు జరిగాయని నరేశ్ గుర్తుచేశారు. అంతా అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత ముండ మోసిన‌ట్లు ఎందుకు ఏడుస్తున్నారు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతిగా ఏడ్చే మ‌గ‌వాడిని న‌మ్మ‌ొద్దని…

ఇప్ప‌టికీ తాము క‌లిసి ప‌నిచేద్దామ‌నే పిలుస్తున్నామని నరేశ్ స్పష్టం చేశారు. మాలో పెత్త‌ందారీ వ్య‌వ‌స్థ పోవాలని.. బ‌య‌ట నుంచే ప్ర‌శ్నిస్తామంటే, ఈసారి ఓట్లు కూడా రావు అని నరేశ్ జోస్యం చెప్పారు. అంతకుముందు మా కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు బుధవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ నటుల పెన్షన్‌కు సంబంధించిన ఫైల్‌పై విష్ణు తొలి సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్యానెల్ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus