సినీ నటుడు నర్సింగ్ యాదవ్ (52) కన్నుమూశారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. నర్సింగ్ యాదవ్ అసలు పేరు మైలా నరసింహ యాదవ్. ఇండస్ట్రీలో అందరూ నరసింగ్ యాదవ్ అని పిలుస్తారు. 1963 మే 15న హైదరాబాద్‌లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. 300లకు పైగా సినిమాల్లో నటించి కామెడీ విలన్‌గా, విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు, హిందీ, తమిళ్ బాషల్లో నటించారు. రజనీకాంత్ నటించిన బాషాలోనూ మంచి కేరక్టర్ చేశారు.
విజయనిర్మల దర్శ కత్వం వహించిన హేమాహేమీలుతో ఇండస్ట్రీకి పరిచయం క్షణక్షణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్, శంకర్ దాదా ఎంబీబీయస్, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజమీందార్, సుడిగాడు, కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన కేరక్టర్లకు చాలా మంచి పేరు వచ్చింది. ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబర్ 150లోనూ నటించారు. గత కొంతకాలంగా డయాలిసిస్ జరుగుతోంది.