మోడీ ప్రభుత్వాన్ని సందు దొరికినప్పుడల్లా ఎండగట్టి ట్విట్టర్ లో ఆ పార్టీ సభ్యులకు, వారి విధానాలకు చుక్కలు చూపించిన వ్యక్తుల్లో ప్రకాష్ రాజ్ ఒకడు. అదే స్థాయిలో నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఎదుర్కొన్నాడనుకోండి. ఈ ఎన్నికల్లో బెంగుళూరు నుంచి ఆయన కూడా ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేశాడు. మోడీ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకతకు ప్రకాష్ రాజ్ ఈజీగా గెలిచేస్తాను అనుకున్నాడు. కానీ.. ఊహించని విధంగా చాలా దారుణంగా ఓడిపోయాడు ప్రకాష్ రాజ్.
మరి ఎవరో తన ఓటమిని గేలి చేసేవరకూ ఊరుకోవడం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ.. తన ఓటమిని తానే అంగీకరిస్తూ ట్వీట్ చేశాడు ప్రకాష్ రాజ్. ప్రజాస్వామ్యంలో ఇది తనకు తగిలిన పెద్ద దెబ్బ అని పేర్కొనడమే కాక.. తన పోరాటాన్ని కంటిన్యూ చేస్తానని కూడా పేర్కొన్నాడు ప్రకాష్ రాజ్. మరి ఈ పరాజయం నుంచి ప్రకాష్ ఏం నేర్చుకున్నాడో తెలియాలంటే కొన్నాళ్లపాటు ఆగాల్సిందే.