ఉదయ భాను ఒకప్పుడు పీక్ స్టార్ డమ్ చూసిన యాంకర్. గతంలో ఈమె భారీ పారితోషికం డిమాండ్ చేసిన యాంకర్ అని కూడా చెప్పాలి. మాస్ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఉదయ భాను. కానీ ఇప్పుడు ఆమెకు అవకాశాలు లేవు. ఓ ఈవెంట్లో ‘ఇక్కడ పెద్ద సిండికేట్ ఉంది.. మళ్ళీ నెల వరకు నాకు యాంకరింగ్ చేసే ఛాన్స్ రాకపోవచ్చు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది ఉదయభాను. తాజాగా తన పారితోషికం గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి మళ్ళీ వార్తల్లో నిలిచింది.
ఉదయ భాను ఈ విషయం పై మాట్లాడుతూ.. “యాంకర్లలో హీరోయిన్ల రేంజ్, యాంకర్లలో హైయెస్ట్ పెయిడ్, యాంకర్లలో స్టార్, యాంకర్లలో సూపర్ స్టార్.. ఆ ఇమేజ్ చూసి వచ్చాను అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ వాస్తవానికి చెప్పుకుంటే.. మా ఇంట్లో బౌన్స్ అయిన చెక్స్ చాలా ఉన్నాయి. నాకు వచ్చిన అవార్డ్స్ బదులు అవి పెట్టుకోవాలి అనిపిస్తుంటుంది.
ఇంకో రకంగా వాటితో తోరణాలు కట్టేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంటుంది. నాకు పారితోషికం ఎగ్గొట్టిన నిర్మాతలు చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ కి ఇచ్చేస్తాను అని 100 ఎపిసోడ్లు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. టెలివిజన్ పరంగా నేను సంపాదించుకున్న డబ్బు ఏమీ లేదు. కానీ టీవీ ద్వారా నాకు మంచి క్రేజ్ వచ్చింది. ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అందువల్ల నాకు షోలు వంటివి చేసుకునే అవకాశం ఎక్కువ దక్కింది. వాటిలో నేను సంపాదించుకున్నాను” అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది.