బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ కాస్త ఇండియన్ స్టార్ అయిపోయారు. దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రజలు ప్రభాస్ ని తమ హీరోగా భావిస్తున్నారు. తమ ప్రాంతంలో జరిగే వేడుకకు, పండుగలకు ప్రభాస్ రావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఒకసారి రెండుసార్లు పిలుస్తారు. కానీ పంజాబీ వాసులు మాత్రం ప్రభాస్ కి వందలకొద్దీ ఆహ్వానాలు పంపిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో వైశాఖి పండుగను ప్రతి ఏటా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు. కాలేజ్ ల్లోనూ వైభవంగా చేస్తుంటారు. ఆ వేడుకలకు రావాలంటూ పంజాబ్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రభాస్ ని పిలుస్తున్నారు. గత ఏడాది చండీఘడ్ యూనివర్సిటీలో వైశాఖి పండుగలకు ప్రభాస్ హాజరయ్యారు.
అందుకే ఈసారి మళ్ళీ పిలుస్తున్నారు. అప్పుడయితే బాహుబలి కంక్లూజన్ రిలీజ్ సమయం కాబట్టి.. ప్రమోషన్లో భాగంగా అక్కడికి వెళ్లారు. ఈసారి మాత్రం వీలు కుదిరేలా లేదు. కారణం.. సాహో షూటింగ్. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ పరిమిషన్ కోసం నెలరోజులు కస్టపడి అనుమతి తీసుకున్నారు. మొన్నటి నుంచి షూటింగ్ మొదలయింది. 40 రోజులు పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో కీలకం కానుంది. ఈ ఛేజింగ్ సీన్ కోసమే 30 కోట్లు బడ్జెట్ కేటాయించారు. ఈ షూటింగ్ లో బాలీవుడ్ స్టార్స్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ పాల్గొంటున్నారు. సో నెలరోజులు ప్రభాస్ దుబాయ్ నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. అందుకే ఎన్ని సార్లు ఆహ్వానించినా ప్రభాస్ వారికి వస్తానని మాట చెప్పలేకపోతున్నారు.