రాజశేఖర్ కు షాకిచ్చిన సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు!

ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ చాలా మారాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిని అలాగే మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిని అస్సలు క్షమించడం లేదు. ఒకటి రెండు సార్లు ఫైన్లు వేసి ఊరుకుంటున్నారు.. దానిని కూడా అలుసుగా తీసుకుని నియమాలని ఉల్లంగిస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు జైలుకు పంపడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. సామాన్యులకే కాదు ఎంతటి సెలబ్రిటీలను అయినా వారు లెక్కచేయడం లేదు. ఇప్పుడు ఈ లిస్ట్ లో హీరో రాజ‌శేఖ‌ర్ కూడా చేరినట్టు తెలుస్తుంది. అవును రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ను ర‌ద్దు చేయాల‌నే ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ట్టు తాజా సమాచారం.

ఇటీవ‌ల జ‌రిగిన ఓఆర్ఆర్ రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న ను బేస్ చేసుకుని పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారని తెలుస్తుంది. రాజ‌శేఖ‌ర్ డ్రైవింగ్ లైసెన్స్ ను ర‌ద్దు చేయాల‌ని.. సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్ప‌టికే ఆర్టీఏకి లేఖ కూడా రాశార‌నిది తాజా సమాచారం. కాబట్టి మరికొద్ది రోజుల్లో ఆయ‌న లైసెన్స్ ర‌ద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజశేఖర్ ఇప్పటికే రెండు, మూడు సార్లు ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన కారణంగా పోలీసులు తీసుకున్న ఈ నిర్ణ‌యం తీసుకున్నట్టు స్పష్టమవుతుంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus