‘సరిలేరు నీకెవ్వరు’ పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్..!

తాజాగా విడుదలైన ‘సూర్యుడివో చంద్రుడివో’ పాటతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పై అంచనాలు మరింత పెంచేసిందనే చెప్పాలి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చాలా రోజుల తర్వాత మహేష్ ను కంప్లీట్ మాస్ యాంగిల్ లో చూపించబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మరో కీలక పాత్ర పోషిస్తోన్న నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు.

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “ఈసారి పెద్ద పండుగకు పండుగలాంటి సినిమాతో వస్తున్నాం. విడుదలకు ముందే సినిమా గురించి ఎక్కువగా మాట్లాడే అలవాటులేదు కాబట్టి ఎక్కువగా మాట్లాడాను. మహేష్ కెరీర్ లోనే అన్ని కమెర్షియల్ అంశాలు ఉన్న సినిమాగా ‘సరిలేరు నీకెవ్వరు’ నిలిచిపోతుంది. కచ్చితంగా ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. నా పాత్రకు నేను డబ్బింగ్ కూడా చెప్పేసాను. సినిమా చాలా బాగా వచ్చింది” అంటూ చెప్పుకొచ్చారు.

24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus