‘మాస్ జాతర’ లో వాళ్ళ కాంబో హైలెట్ అవుతుందట..!

మాస్ మహారాజ్ రవితేజ  (Ravi Teja) హీరోగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మాణంలో ‘మాస్ జాతర’ (Mass Jathara)  అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘భాను భోగవరపు’ (Bhanu Bhogavarapu) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీలీల (Sreeleela) ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. భీమ్స్ (Bheems Ceciroleo) ఈ సినిమాకి సంగీత దర్శకుడు. చాలా వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Mass Jathara

ఈ సినిమాలో రవితేజ పోలీస్ రోల్లో కనిపించబోతున్నాడు. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. కచ్చితంగా ప్లాపుల్లో ఉన్న రవితేజని ఈ సినిమా గట్టెక్కించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారట. ఆ విషయాన్ని రాజేంద్రప్రసాద్ స్వయంగా మీడియాతో షేర్ చేసుకున్నారు.

‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజేంద్ర ప్రసాద్ ఈరోజు మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఆయన..”మాస్ జాతర సినిమాలో రవితేజ తాతయ్య పాత్ర పోషిస్తున్నాను. తాతామనవళ్లుగా మా కాంబినేషన్ అదిరిపోతుంది” అంటూ చెప్పుకొచ్చారు. గతంలో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ (Kshemamga Velli Labhamga Randi) సినిమాలో రాజేంద్రప్రసాద్ హీరోగా నటిస్తే.. రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

అటు తర్వాత ‘నిప్పు’ (Nipuu) సినిమాలో రవితేజ హీరోగా నటిస్తే.. రాజేంద్రప్రసాద్ మామగారు టైపు పాత్రని పోషించాడు. అలాగే ‘రాజా ది గ్రేట్’ (Raja the Great) లో కూడా రాజేంద్రప్రసాద్, రవితేజ కలిసి కామెడీ అద్భుతంగా పండించారు. ఇక ఇప్పుడు ‘మాస్ జాతర’ లో రవితేజ, రాజేంద్ర ప్రసాద్ తాతా మనవళ్లుగా కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది.

హీరో క్యారెక్టర్లపై మాజీ ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus