హీరో క్యారెక్టర్లపై మాజీ ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

‘పుష్ప’ (Pushpa) , ‘కేజీయఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar).. ఈ సినిమాల్లో ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. అన్నీ యాక్షన్‌ సినిమాలే, స్టార్‌ హీరోల సినిమాలే, భారీ విజయం అందుకున్న సినిమాలే లాంటి పాయింట్లు కాదు. ఈ మూడు సినిమాల్లో హీరోకి విలన్‌ ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ మాటకొస్తే చాలా సినిమాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే రీసెంట్‌గా వచ్చి, బాగా నోళ్లలో నానిన సినిమా పేర్లు కాబట్టి ఇవి చెబుతున్నాం. విలన్‌లను హీరోలుగా చూపించడం గురించి గత కొన్ని రోజులు చర్చ జరుగుతోంది.

Venkaiah Naidu

తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇలాంటి సినిమాల గురించి మాట్లాడారు. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదని, అదొక కళాత్మక సందేశమని.. ప్రజలకు మంచి విషయాన్ని తెలియజేసే సాధనం అని చెప్పిన ఆయన.. ఇటీవల కాలంలో విలన్‌ పాత్రల్ని హీరోలుగా చూపించడం ఎక్కువైంది అని వ్యాఖ్యానించారు. విలన్‌లను హీరోలుగా చూపిస్తే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనేది ఆయన మాటల సారాంశం. ఇలా హీరోలుగా ఆ పాత్రల్ని చూపించడం చాలా తప్పని..

అలాంటివి పిల్లల ముందు పెట్టకూడదని వెంకయ్య నాయుడు హితవు పలికారు. సందేశాన్ని, సంతోషాన్ని అందించడమే సినిమా లక్ష్యం కావాలి ఆయన పిలుపునిచ్చారు. దాంతోపాటు ఆయన మరొక అంశం గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం సినిమాల సంభాషణల్లో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు పెట్టడం కూడా పెరిగతిందని, అర్థవంతమైన సంభాషణలు రాస్తే చాలని, ద్వంద్వార్థాలు పెట్టాల్సిన పనిలేదని చెప్పారు.

సినిమాల విషయంలో ప్రమాణాలు పాటించాలని, కామెడీలో అశ్లీలత లేకుండా చూసుకోవాలి అని వెంకయ్య నాయుడు సూచించారు. దీంతో మన సినిమాల తీరు గురించి బయట స్పందించిన తొలి పెద్ద వ్యక్తి ఆయనే అయ్యారు. ఆయన అన్నారని కాదు కానీ.. అలా విలనీ చేసిన, నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోల సినిమాలు మన దగ్గర ఎక్కువయ్యాయి. ఇక్కడో విషయం ఏంటంటే ఇలాంటి ఓ సినిమాలోని నటనకుగాను ఆ సినిమా హీరోకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా దక్కింది.

ఐఏఎస్ మాటలకు హార్ట్ అయిన వంగా.. స్ట్రాంగ్ కౌంటర్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus