Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!
- August 19, 2026 / 05:23 PM ISTByPhani Kumar
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్(Ram) రియల్ హీరో అనిపించుకున్నాడు. విషయంలోకి వెళితే.. తన వీరాభిమాని అయినటువంటి ఒక చిన్న పాప అనారోగ్యంతో బాధపడుతూ మెడిసిన్ లేదా ఫుడ్ తీసుకోకుండా మారాం చేస్తుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు, పెద్దలు కంగారు పడుతూ పెద్దలను, విలేఖరులను సంప్రదించారు. ఆ పాప పేరు శశిభవ్య. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం, దుప్పలపూడి గ్రామానికి చెందినది. మందులు వేసుకోవాలన్నా,ఆహారం తినాలన్నా రామ్ పేరు చెబితేనో లేదంటే రామ్ పాటలు చూపిస్తేనో తింటుందట.
Ram

ఇప్పుడు మరింత మొండిగా మారడంతో పెద్దలు, విలేఖరులను సంప్రదించారు వారి తల్లిదండ్రులు. సోషల్ మీడియా ఖాతా ద్వారా రామ్ టీమ్..ని సంప్రదించి విషయం చేరవేయగా.. రామ్ వెంటనే స్పందించి ఆ పాపకి వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ” హాయ్ శశి… గుర్తుపట్టావా? నువ్వు కళ్ళజోడు పెట్టుకుంటే చాలా బాగున్నావ్. నీ వీడియోలు చూశాను. నువ్వు బాగా తిని, మందులు వేసుకుని బలంగా తయారయితే.. నేను వచ్చి నిన్ను కలుస్తాను. కావాలంటే ఫుడ్, మందులు నేనే పంపిస్తాను.
అవన్నీ వేసుకుని కోలుకున్నాక హైదరాబాద్ రా. అప్పుడు నిన్ను కలుస్తాను. నాకైతే నిన్ను కలవాలని ఉంది. నీకు ఉందా?” అంటూ ఆ చిన్నారిని ఆప్యాయంగా పలకరించాడు రామ్. అంతేకాదు శశిభవ్య వైద్యానికి, మందులకు మరియు ఆహారానికి అయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని కూడా ఆమె పెద్దలకి భరోసా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబానికి కొండంత ధైర్యాన్ని నింపినట్టు అయ్యింది. సోషల్ మీడియాలో శశి భవ్యకి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. చాలా మంది నెటిజెన్లు రామ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘ధురంధర్’ నాయిక ఎంగేజ్‌మెంట్ అయిందా? ఫొటోలు వైరల్!












