రావు గోపాల్ రావుగారి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్.అంచలంచలుగా టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో సీరియల్స్ లో నటించిన రావు రమేష్.. అటు తర్వాత ‘కొత్త బంగారు లోకం’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘అఆ’ వంటి చిత్రాలతో స్టార్ యాక్టర్ గా ఎదిగాడు. ఇప్పుడు ఈయన డిమాండ్ మరింత పెరిగింది. ఏకంగా ‘కె.జి.ఎఫ్2’ వంటి భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. టాలీవుడ్లో అయితే ప్రకాష్ రాజ్ ను కూడా సైడ్ ఏసేసి వరుస అవకాశాలను దక్కించుకుంటున్నాడు.
ఇప్పుడు ఈయన డిమాండ్ రూ.1.5 కోట్లకి చేరిందట. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఒక్క సినిమాకే అంత ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. వివరాల్లోకి వెళితే.. మలయాళంలో సూపర్ హిట్ అయిన.. `నాయట్టు`ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ‘గీతా ఆర్ట్స్’ వారు ఈ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు.మూడు పాత్రల చుట్టూ తిరిగే ఈ కథని..తెలుగులో శ్రీవిష్ణు, రావు రమేష్, అంజలి లు ప్రధాన పాత్రలుగా తెరకెక్కనుంది.
కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం రావు రమేష్ ను ఫిక్స్ చేశారట. అందుకు రావు రమేష్ కూడా ఓకే చెప్పడం.బల్క్ డేట్స్ ఇచ్చేయడం జరిగిందట. కేవలం ఈ మూవీ కోసం ఆయన రూ1.5 కోట్లు పారితోషికం అందుకున్నట్టు సమాచారం. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. ఆయన హీరోతో సమానంగా పారితోషికం అందుకోబోతుండడం.