Sarathkumar: నా కూతురు క్యారెక్టర్ అలాంటిది.. శరత్ కుమార్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన శరత్ కుమార్ ఒక సందర్భంలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ నటనను విజయశాంతితో పోలుస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు. మొదట వరలక్ష్మి సినిమాల్లోకి వస్తానని చెబితే ఎం.ఏ చదివిన నువ్వు సినిమాల్లోకి రావడం అవసరమా అని అన్నానని శరత్ కుమార్ కామెంట్లు చేశారు. అయితే వరలక్ష్మి మాత్రం సినిమాల్లో నటిగా కెరీర్ ను కొనసాగించాలని భావించి ఈ స్థాయికి వచ్చిందని శరత్ కుమార్ పేర్కొన్నారు.

వరలక్ష్మి బ్యాగ్రౌండ్ ఉన్నా ఓన్ టాలెంట్ తో ఎదిగిందని ఆమె బోల్డ్ అండ్ బ్రేవ్ ఉమెన్ అని శరత్ కుమార్ చెప్పుకొచ్చారు. ఒకరోజు రాత్రి వరలక్ష్మి ఇద్దరు వ్యక్తులను కొట్టిందని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ఆయన అన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు వరలక్ష్మి కారును ఢీ కొట్టి అల్లరి చేయడంతో ఆమె వాళ్లిద్దరినీ చితకబాదిందని శరత్ కుమార్ కామెంట్లు చేశారు. వరలక్ష్మి అంతటి ధైర్యశాలి అని ఆయన చెప్పుకొచ్చారు.

వరలక్ష్మి తండ్రిని అయినందుకు గర్వంగా ఫీలవుతున్నానని శరత్ కుమార్ అన్నారు. ప్రస్తుతం వరలక్ష్మి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో ఎక్కువగా నటిసుండటం గమనార్హం. వరలక్ష్మికి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. వరలక్ష్మి శరత్ కుమార్ రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది. వరుస విజయాలతో వరలక్ష్మి శరత్ కుమార్ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి విజయాలతో వరలక్ష్మి మార్కెట్ పెరిగింది.

వరలక్ష్మి ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని నమ్మకాన్ని కలిగి ఉన్నారు. వరలక్ష్మి రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్రలను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది. స్టార్ హీరోల సినిమాలలో వరలక్ష్మికి ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus