గత నాలుగైదు నెలలుగా విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. శరత్ బాబు, గద్దర్ వంటి దిగ్గజ నటులు ఇటీవల కన్నుమూశారు. ఆ తర్వాత చాలా మంది సినీ సెలబ్రిటీలు మృతి చెందారు. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. గద్దర్ మరణవార్త నుండి ఈ వార్తలు ఇంకా పెరిగాయి అని కొందరు భావిస్తున్నారు. ప్రమాదాల వల్లో లేక అనారోగ్య సమస్యల వల్లనో, లేదంటే వయసు సంబంధిత సమస్యల వల్లనో.. ఇలా ఏదో ఒక రకంగా సెలబ్రిటీలు మరణిస్తూ ఉండటం మనం చూశాం.అలాగే నటీనటులు, నిర్మాతలు, దర్శకులు మాత్రమే కాకుండా టెక్నికల్ టీం.. లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరణిస్తూ వస్తున్నారు.
వాళ్లు అనే కాదు … సెలబ్రిటీల కుటుంబ సభ్యులు కూడా మరణిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా బాలీవుడ్ నటుడు బీర్బల్ ఖోస్లా మరణించారు. అతని వయస్సు 80 యేళ్ళు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుతూ వస్తున్న … ఆయన ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఉప్కార్, రోటీ కప్డా ఔర్ మకాన్, క్రాంతి లాంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు.
బాలీవుడ్‌లో బీర్బల్‌గా ఈయన ఎక్కువ ఫేమస్ అని చెప్పాలి. ‘షోలే’ చిత్రంలోనూ ఈయన కీలక పాత్ర పోషించారు. షోలేలో ఖైదీ పాత్రలో ఆయన కనిపిస్తారు.అతని పాత్ర చాలా మందితో క్లాప్స్ కొట్టించింది. మరోపక్క నసీబ్, యారానా, హమ్ హై రహీ ప్యార్ కే, అంజామ్ వంటి చిత్రాలలో కూడా చిన్న చిన్న పాత్రలు చేశాడు.