Sharad Kelkar: నా కూతురికి నా గురించి తెలియకపోవడమే నయం.. నటుడు ఏమన్నారంటే?

  • June 7, 2024 / 02:04 PM IST

ప్రభాస్ (Prabhas) ఓం రౌత్ (Om Raut) కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) మూవీ బాక్సాఫీస్ వద్ద బిలో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఈ సినిమా నిరాశపరిచింది. ఓం రౌత్ టేకింగ్ వల్ల ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. బాలీవుడ్ నటుడు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ శరద్ కేల్కర్ (Sharad Kelkar) ఈ సినిమా గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా కూతురు ఇప్పటివరకు చూసిన ఏకైక సినిమా ఆదిపురుష్ అని ఆయన తెలిపారు.

నా కూతురు పేరు కేశ అని నా కూతురికి నేను చేసిన సినిమాలు కానీ నేను చేసే పని గురించి కానీ పెద్దగా తెలియదని శరద్ కేల్కర్ పేర్కొన్నారు. నా కూతురు అసలు నేను నటించిన సినిమాలే చూడదని ఆయన తెలిపారు. నా కూతురు టీవీ షోలు, సినిమాలపై అంతగా ఆసక్తి చూపించదని శరద్ కేల్కర్ వెల్లడించడం గమనార్హం. అందువల్ల నా కూతురికి నా వృత్తేంటో తెలియదని ఆయన పేర్కొన్నారు.

ఒక రకంగా చెప్పాలంటే ఇదే నయమని నా కూతురు అమాయకంగా ఉంటే బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు నేనేంటో, నా పాపులారిటీ ఎలా ఉంటుందో తనకు నేనే పరిచయం చేస్తానని శరద్ కేల్కర్ వెల్లడించారు. ఆదిపురుష్ సినిమాలో నా గొంతును చూసి నా కూతురు ఆశ్చర్యపోయిందని ఆయన తెలిపారు.

నా కూతురు కేశ ఇప్పుడు ఎదుగుతోందని కూతురికి నెమ్మదిగా యాక్షన్ కామెడీ సినిమాలు కూడా చూపించడం మొదలుపెడతానని శరద్ కేల్కర్ పేర్కొన్నారు. శరద్ కేల్కర్ మొదట్లో సీరియల్స్ లో నటించి తర్వాత సినిమాలకు షిఫ్ట్ అయ్యారు. శరద్ కేల్కర్ సర్దార్ గబ్బర్ సింగ్ (Sardaar Gabbar Singh) సినిమాలో రాజా భైరవ్ సింగ్ రోల్ లో నటించారు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ పాత్రకు శరద్ కేల్కర్ హిందీలో డబ్బింగ్ చెప్పారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus