ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ‘మా'(మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ) ప్రెసిడెంట్ అయిన శివాజీ రాజా అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు బీపీ బాగా డౌన్ అవ్వడంతో హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలుస్తుంది. దాంతో వెంటనే స్టార్ హాస్పిటల్ లో జాయిన్ చేసారట. ప్రస్తుతం ఆయన స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. రేపు కూడా అబ్సర్వేషన్ లో ఉంచుతారని తెలుస్తుంది. ఎల్లుండి హార్ట్ కు స్టంట్ వేస్తారని వైద్య నిపుణుల నుండీ సమాచారం అందింది. ప్రస్తుతానికి అయితే కంగారు పడాల్సిన పరిస్థితి ఏమీ లేదని కూడా తెలుస్తుంది.
శివాజీ రాజా అనారోగ్యం పై వస్తున్న వార్తలతో టాలీవుడ్ లో ఉన్న ఆయన సన్నిహితులు కంగారు పడుతున్నారు. లాక్ డౌన్ వల్ల ఎక్కువ మంది హాస్పిటల్ కు రావొద్దు అని సెలబ్రిటీలకు సమాచారం వెళ్లినట్టు కూడా తెలుస్తుంది. 400 కు పైగా సినిమాల్లో నటించిన శివాజీ రాజా… కమెడియన్ గా కెరీర్ ను మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అలరించాడు. అంతేకాదు ‘మా’ కు ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నో సేవలు చేసాడు.
అయితే గతేడాది జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఈయన నరేష్ ప్యానల్ పై ఓడిపోయారు. అంతకు ముందు ‘మా’ అసోసియేషన్ ద్వారా కలెక్ట్ చేసిన నిధులను దుర్వినియోగం చేస్తున్నాడు అన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. ఎన్నో వివాదాలు వల్లే… ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు అని కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.