Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

  • December 19, 2025 / 10:06 PM ISTByFilmy Focus Writer
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో కొన్ని పేజీలు ఇప్పటికీ నెత్తుటి మరకలతోనే కనిపిస్తాయి. అందులో బైరాన్‌పల్లి ఉదంతం ఒకటి. నిజాం రజాకార్ల అరాచకానికి సాక్ష్యంగా నిలిచిన ఈ గ్రామం ఇప్పుడు మన టాలీవుడ్ దర్శకులకు ఒక ఎమోషనల్ పాయింట్ గా మారింది. ఒకప్పుడు కమర్షియల్ కథల వైపు చూసిన నిర్మాతలు, ఇప్పుడు ఇలాంటి మరుగున పడిన చారిత్రక అంశాలను వెలికితీసే పనిలో పడ్డారు. తాజాగా అశ్విని దత్ లాంటి బడా నిర్మాత కూడా ఇదే బ్యాక్ డ్రాప్ ఎంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

Champion

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ‘ఛాంపియన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పైకి ఇది ఒక ఫుట్ బాల్ ప్లేయర్, ఒక థియేటర్ ఆర్టిస్ట్ మధ్య నడిచే ప్రేమకథలా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న అసలు సోల్ మాత్రం బైరాన్‌పల్లి ఊచకోతే అని రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. 1948 ఆగస్టు 27న జరిగిన ఆ దారుణ కాండను ఈ సినిమా కథలో ఒక భాగంగా బలంగా చూపించబోతున్నారు.

అసలు చరిత్రలోకి వెళ్తే.. భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అవుతున్న రోజులవి. నిజాం ప్రైవేట్ సైన్యం అయిన రజాకార్లు బైరాన్‌పల్లి గ్రామంపై విరుచుకుపడి సుమారు 200 మంది అమాయక గ్రామస్తులను పొట్టనబెట్టుకున్నారు. ఆనాటి ఆ భయానక వాతావరణం, ప్రజల తెగువ, త్యాగం ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల గుండెల్లో మెదులుతూనే ఉంటాయి. ఆ ఎమోషన్ ను వాడుకుంటే సినిమాకు బలం చేకూరుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

అయితే ఈ ప్రయత్నం చేయడం రోషన్ ఒక్కడే కాదు. ఈ మధ్యనే వచ్చిన ‘రజాకర్’ సినిమాలో కూడా ఈ ఘటన తాలూకు తీవ్రతను, రాజకీయ పరిస్థితులను కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. అలాగే ‘బైరాన్‌పల్లి’ పేరుతోనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా వచ్చింది. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒక మోస్తారు ఫలితాన్ని అందుకున్నా, చరిత్రను గుర్తు చేయడంలో మాత్రం సఫలమయ్యాయి.

ఇప్పుడు అదే పాయింట్ ను తీసుకుని రోషన్ ‘ఛాంపియన్’ రావడం చర్చనీయాంశంగా మారింది. ఒకే ఘటన చుట్టూ ఇన్ని సినిమాలు రావడం చూస్తుంటే, ఆ కథలో ఉన్న ఇంటెన్సిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక విషాదకరమైన అధ్యాయమే అయినా, వెండితెరపై ఎమోషన్ పండించడానికి దర్శకులు దీన్నే నమ్ముకుంటున్నారు. మరి వైజయంతీ మూవీస్ లాంటి పెద్ద సంస్థ తీస్తున్న ఈ సినిమాలో ఆ చరిత్రను ఎంత నిజాయితీగా, ఎంత కొత్తగా చూపిస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

trending news

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

2 hours ago
Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

2 hours ago
Gurram Paapi Reddy  Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

Gurram Paapi Reddy Review in Telugu: “గుర్రం పాపిరెడ్డి” సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 hours ago

latest news

The Paradise: ఏందిరన్నా ఈ లుక్! ‘బిర్యానీ’గా బర్నింగ్ స్టార్

The Paradise: ఏందిరన్నా ఈ లుక్! ‘బిర్యానీ’గా బర్నింగ్ స్టార్

1 hour ago
Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

2 hours ago
The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

2 hours ago
Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

Pushpa 3: ఆ అస్త్రం ఇప్పుడే వద్దు.. బన్నీ, సుకుమార్ సీక్రెట్ ప్లాన్

3 hours ago
Dhurandhar : ‘దురంధర్’ పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్..!

Dhurandhar : ‘దురంధర్’ పై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version