నందమూరి బాలకృష్ణ సూపర్ ఫామ్లో ఉన్నారు. ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’ ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలు అన్నీ సూపర్ హిట్లు అయ్యాయి. మరో 3 రోజుల్లో ‘అఖండ 2’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకుడు. బాలయ్య- బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే మాస్ ఆడియన్స్ కి గూజ్ బంప్స్ వచ్చేస్తాయి.
వీరి కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చాయి. ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’.. ఈ 3 ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు సూపర్ హిట్ అయ్యాయి. ‘అఖండ’ సినిమా 2021 లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ రిలీజ్ అయినప్పటికీ.. బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో దానికి సీక్వెల్ గా రూపొందిన ‘అఖండ 2’ పై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషనల్ కంటెంట్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

డిసెంబర్ 5న రిలీజ్ కాగా.. డిసెంబర్ 4 నుండే ప్రీమియర్ షోలు కూడా వేయబోతున్నారు. ఆల్రెడీ నిర్మాతలైన 14 రీల్స్ వారు ఇండస్ట్రీలో ఉన్న తమ స్నేహితులకు, బాలయ్య-బోయపాటి స్నేహితులకు, అలాగే కొంతమంది పెద్దలకి సినిమాని చూపించడం జరిగింది. అనంతరం వారు సినిమాపై తమ అభిప్రాయం షేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
వారి టాక్ ప్రకారం.. ‘అఖండ 2’ రన్ టైం 2 గంటల 46 నిమిషాల వరకు ఉంటుందట. విలన్ ట్రాక్ తోనే సినిమా స్టార్ట్ అవుతుందట. తర్వాత అనంతపూర్ కి షిఫ్ట్ అవ్వడం. అక్కడ మురళీ కృష్ణ ఫ్యామిలీని పరిచయం చేయడం.. ఆ వెంటనే జాజికాయ సాంగ్ వంటివి వస్తాయట. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ తో మళ్ళీ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందట. అఘోర పాత్ర ఎంట్రీకి పెద్ద యాక్షన్ ఎపిసోడ్ పెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ఫస్ట్ హాఫ్ అదిరిపోతుందట. సెకండాఫ్ లో మథర్ సెంటిమెంట్, పాప సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. ఈ సినిమాలో కూడా బాలయ్య డైలాగ్స్, ఫైట్స్ టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో..!
