ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారు నడిపి 70 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలు తీసినందుకు శింబు కారు డ్రైవర్ సెల్వంని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 18 రాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్ కారులో వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. ఇది గమనించని కారు డ్రైవర్ అతడి పైనుంచి కారు నడపడంతో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో రాజేందర్ ప్రమాదం జరిగిన చోటు నుంచి 10 మీటర్ల దూరంలో కారు దిగి ఆంబులెన్స్ కి ఫోన్ చేశారు. అయితే అప్పటికే ఆ వృద్ధుడు మునుస్వామి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. శింబు డ్రైవర్ సెల్వంను మార్చి 19న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఉన్న ఇన్నోవా కారు శింబు పేరు మీద రిజిస్టర్ అయింది ఉంది.
శింబు పేరు మీద రిజిస్టర్ కావడంతో ఈ యాక్సిడెంట్ చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని పాండీ బజార్ పోలీసులు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.సెక్షన్ 337, 297, 304 (ఏ) కింద డ్రైవర్ మీద కేసులు పెట్టారు. అయితే ఈ ఘటనపై శింబు కుటుంబం ఇంకా స్పందించలేదు. శింబు ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసమే ఈ ప్రమాదాన్ని అతిగా ప్రచారం చేస్తున్నారని.. కావాలనే శింబుని మధ్యలోకి లాగుతున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!