హీరోగా కొన్ని సినిమాలు చేసిన నటుడు సుధాకర్ ఆ తరువాత కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మొత్తంగా 600కి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తమిళంలో చాలా సినిమాల్లో హీరోగా నటించారు. అప్పటి హీరోయిన్ రాధికతో కలిసి 18 చిత్రాలలో నటించారు సుధాకర్. ఆమెతో ఎక్కువ సినిమాలు చేయడం, తరచూ ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం నడిచింది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సుధాకర్.
1983లో తనకు పెళ్లి జరిగిందని.. పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకున్నానని చెప్పారు. సినిమా వాళ్లంటే చాలా రూమర్లు వస్తుంటాయని.. తన మీద కూడా అప్పట్లో చాలా రూమర్లు వచ్చాయని అన్నారు. తమిళంలో రాధికతో ఎక్కువ సినిమాలు చేయడం వలన.. ఆమెతో కలిసి తిరుగుతున్నా అంటూ భయంకరమైన రూమర్లు చక్కర్లు కొట్టేవని అన్నారు. వాటిని పట్టించుకునేవాడ్ని కాదంటూ ఆ వార్తలను ఖండించారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. కాఫీ ఎక్కువగా తాగుతానని అన్నారు.
ఎప్పుడైనా పార్టీకు వెళ్తే.. ఓ గ్లాస్ బీర్ తాగేవాడినని అంతకుమించి ఎక్కువగా తాగింది లేదని అన్నారు. ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు. అయినప్పటికీ తన ఆరోగ్యం పాడైందని.. చావు వరకు వెళ్లొచ్చానని.. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే తన కొడుకు బెన్నిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు.