Suriya: దేవర కోసం సూర్య చేసిన పనికి ఫిదా అవుతున్న తారక్ ఫ్యాన్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఎన్టీఆర్ ఒకరు ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయగా

ఈ వీడియో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాకు హీరో సూర్య చేసిన సహాయం పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవర సినిమాకు సూర్య చేసిన సహాయం ఏంటి అనే విషయానికి వస్తే… సూర్య శివ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి కంగువ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది అయితే ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైందట. కానీ ఈ సినిమా విడుదల సమయంలోనే ఎన్టీఆర్ దేవర సినిమా కూడా విడుదలవుతున్నటువంటి తరుణంలో స్వయంగా (Suriya) సూర్య తన సినిమాని వాయిదా వేసుకోమని మేకర్స్ కి సూచించారట.

ఇలా ఎన్టీఆర్ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో పోటీగా తన సినిమా ఉండకూడదని భావించి ఎన్టీఆర్ సినిమాకు అడ్డు తప్పుకున్నారని తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి సూర్య తన లుక్ కి సంబంధించినటువంటి పోస్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఇది ముగింపు కాదు ఎన్నో కథలకు ఆరంభం అంటూ ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus