Tarun, Niharika: మెగాడాటర్ తో పెళ్లిపై స్పందించిన హీరో తరుణ్!

టాలీవుడ్‌లోకి బాల నటుడిగా పరిచయం అయిన హీరో తరుణ్ పలు సూపర్‌ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా లవ్‌ స్టోరీస్‌తో సక్సెస్‌ కొట్టి లవర్‌ బాయ్‌గా పేరుతెచ్చుకున్నారు హీరో తరుణ్‌. ఆ టైమ్‌లో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోగా, అమ్మాయిల ఫాలోయింగ్‌ ఉన్న హీరోగా నిలిచారు. ఇటీవల కాలంలో ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా కాలంగా తరుణ్‌ సినిమాలు చేయడం లేదు. రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలొచ్చాయి, కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. దీనికితోడు తన తల్లి ఆ మధ్య తరుణ్‌కి పెళ్లి చేయబోతున్నామనే కామెంట్లు కూడా చేసింది. దీంతో అనేక రూమర్స్ ఊపందుకున్నాయి. తరుణ్‌.. మెగా డాటర్‌ని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలొచ్చాయి. నిహారికాతో ఆయన వివాహం జరుగుతుందనే కథనాలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో ఇవి వైరల్‌గా మారాయి. నిహారిక ఇటీవల తన భర్త చైతన్య నుంచి విడాకులు తీసుకుంది. కోర్ట్ నుంచి కూడా విడాకులు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆమె సింగిల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో తరుణ్‌తో పెళ్లికి రెడీ అవుతున్నట్టు కథనాలు చక్కర్లు కొట్టాయి.

ఇవి తారాస్థాయికి చేరడంతో దీనిపై తాజాగా స్పందించారు. పెళ్లిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తరుణ్‌ మాట్లాడుతూ… ఈ ప్రచారం నిజం కాదు అని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు. ఏదైనా శుభవార్త ఉంటే ముందుగా మీకే చెస్తానని నెటిజన్ల ఉద్దేశించి అన్నారు. ఈ వార్తలను నమ్మవద్దని, అది వాస్తవం కాదన్నారు తరుణ్‌. మొత్తానికి పుకార్లకి చెక్‌ పెట్టారు తరుణ్‌.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus