తన కెరీర్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఉపేంద్ర. నటుడిగానే కాకుండా.. రైటర్ గా, డైరెక్టర్ గా పలు సినిమాలకు పని చేశారు. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన నుంచి ఓ పాన్ ఇండియా ప్రకటన వచ్చింది. ప్రముఖ ఆడియో లేబుల్ లహరి సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది.
వీనస్ ఎంటర్టైనర్స్ తో కలిసి సినిమా నిర్మాణం చేపడుతున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్నారు. కన్నడతో పాటు హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హవా నడుస్తుండడంతో ఉపేంద్రతో పాన్ ఇండియా సినిమా తీస్తున్నారు. ఈ సందర్భంగా లహరి సంస్థ చైర్మన్ మనోహరన్ మీడియాతో మాట్లాడారు. ఇరవై ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో వున్నామని, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నామని అన్నారు.
ఉపేంద్రతో కలిసి వెంచర్ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. వీనస్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత శ్రీకాంత్ మాట్లాడుతూ కన్నడంలో పలు విజయవంతమైన సినిమాలు నిర్మించామని, ఇప్పుడు లహరితో కలిసి ఉపేంద్ర కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో ఉపేంద్ర మాట్లాడుతూ.. అభిమానులు, ప్రజల మనోభీష్టం మేరకే కథలు రాసి సినిమాలు తీస్తున్నా అని..
ఇప్పుడు చేయబోయే సినిమా కూడా అదే రీతిలో ఉంటుందని అన్నారు. చాలా కాలం తరువాత ఉపేంద్ర మళ్లీ డైరెక్టర్ అవతమెత్తారు. మరి ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!