ఒకప్పుడు ఎన్నో తెలుగు సినిమాలలో హీరోగా ప్రధాన పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు వేణు ఒకరు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్లలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వేణు తర్వాత పలు సినిమాలలో నటించిన ఆ సినిమాల ద్వారా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి వేణు చాలా రోజుల తర్వాత రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. అయితే తాజాగా ఒక వెబ్ సిరీస్ ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన రీ ఎంట్రీ సినిమాల గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తన కెరియర్ కాస్త ఇబ్బందులలో ఉన్న సమయంలో తనకు బోయపాటి శ్రీను ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి దమ్ము సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
అయితే ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించినటువంటి (Venu) వేణుకి ఎలాంటి గుర్తింపు లభించలేదు. అయితే ఈ సినిమా గురించి ఈయన మాట్లాడుతూ.. బోయపాటి శ్రీను దమ్ము సినిమా కథ నాకు చెప్పకుండా సినిమా చేశారని తెలిపారు. బోయపాటి గారు నాకు కథ చెప్పకుండా షోలే సినిమాలో అమితాబచ్చన్ పాత్ర లాగా ఉంటుందని చెప్పారు.
అలా కాకుండా ఆయన ఈ సినిమా కథ కనుక చెప్పి ఉంటే నేను ఈ సినిమాలో నటించే వాడినే కాదు అంటూ ఈ సందర్భంగా దమ్ము సినిమా గురించి వేణు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి బావ పాత్రలో నటించినటువంటి ఈయన క్యారెక్టర్ చనిపోతుంది అనే సంగతి మనకు తెలిసింది.