తమిళ సీనియర్ స్టార్ హీరో విజయ్ కాంత్ ఈరోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన.. ఎక్కువగా హాస్పిటల్స్ చుట్టూనే తిరుగుతూ వచ్చారు. అమెరికా వంటి దేశాల్లో ఈయన చికిత్స పొందినప్పటికీ.. లాభం లేకపోయింది. మొన్నామధ్య ఈయన కోలుకున్నట్టు కనిపించినా.. సడన్ గా కరోనా భారిన పడటం వల్ల పరిస్థితి విషమించి మరణించినట్టు స్పష్టమవుతుంది. ఇక విజయ్ కాంత్ మరణంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విజయ్ కాంత్ అభిమానులు మాత్రమే కాకుండా కోలీవుడ్ సినీ నటులు సైతం ఆయన మరణవార్తని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు కామెంట్స్ పెడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా .. విజయ్ కాంత్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించారు. అందుకే ఆయన్ని అక్కడి జనాలు ‘కెప్టెన్’ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.
ఇదిలా ఉండగా.. 1952 వ సంవత్సరంలో ఆగస్టు 25న మధురైలో జన్మించారు. 1990 లో విజయ్ కాంత్.. ప్రేమలత అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. విజయ్ కాంత్ .. సక్సెస్ ఫుల్ జర్నీకి ఓ రకంగా ప్రేమలత కూడా కారణమని చెప్పాలి. అయితే విజయ్ కాంత్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చాలా మందికి ఎక్కువగా తెలిసుండదు. కానీ ఇప్పుడు ఆయన (Vijayakanth) ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :